MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ క్రమంలో కవితను ఇవాళ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లో రిమాండ్ నేటితో ముగియనుంది. నిజానికి ఆమెకు బెయిల్ ఇప్పించేందుకు కవిత తరఫు లాయర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె బెయిల్ ఇప్పటివరకు చాలాసార్లు తిరస్కరించబడింది. ఈసారి కూడా కవిత రిమాండ్‌ను కోర్టు పొడిగిస్తారా? లేక బెయిల్ ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఈరోజు కోర్టు పరిశీలించనుంది. ఆ తర్వాత కవితతోపాటు ఇతర నిందితులకు చార్జిషీట్ కాపీని అందించే అవకాశం ఉంది. సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో జ్యుడీషియల్ రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి కవితను నేరుగా కోర్టుకు తీసుకురాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచే అవకాశం ఉంది.
Read also: Iran: 17గంటల తర్వాత దొరికిన హెలికాఫ్టర్ శిథిలాలు..ఇరాన్ అధ్యక్షుడి మృతి
మార్చి 16న కవితను ట్రయల్ కోర్టులో హాజరుపరచగా.. ఈడీ వాదనలు వినిపించింది. కవిత నేతృత్వంలోని సౌత్ గ్రూప్ నుంచి ఆప్ కీలక నేతలకు రూ.100 కోట్లు వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సమాచారం రాబట్టేందుకు ఈడీ కస్టడీకి తీసుకోవాలని కోరగా.. కవితను రెండు దశల్లో మొత్తం 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతించింది. అనంతరం మార్చి 26న కవితను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న ఆమెను కూడా అరెస్ట్ చేసిన సీబీఐ.. మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం మళ్లీ కోర్టులో హాజరుపరచగా.. సీబీఐ కేసులో న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ కూడా విధించింది. ప్రస్తుతం రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది.
Prasanth Varma : రణ్ వీర్ తో సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ..?