MLC Kavitha Press Meet: ఢిల్లీ లిక్కర్ స్కాం పై ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు వచ్చారు. జై తెలంగాణ అనే నినాదంతో మీడియాతో ఆమె మాట్లాడారు. మోడీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుందని అన్నారు. మోడీ 8 ఏళ్ల పాలనలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చింది బీజేపీ అని ఆరోపించారు. మోడీ వచ్చే ముందు ED రావడం సహజమని కొట్టి పారేశారు. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే ED కేసులు అంటూ మీడియా ముందు వ్యాఖ్యానించారు. రాజకీయమైన ఎత్తుగడలో భాగంగానే ED కేసులని కవిత పేర్కొన్నారు. వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతియ్యడానికే మీడియా లీకులు అంటూ మండిపడ్డారు. జైల్లో పెడతాం అంటే బయపడం…జైల్లో పెడుతే ఏం అవుతుంది. జైల్లో పెట్టి ఉరి వెయ్యరు కదా? అని ప్రశ్నించారు.
బీజేపీ ఛీప్ ట్రిక్ ప్లే చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి విచారణకైనా ఎదుర్కొంటామన్నారు కవిత. మీరు చేయిస్తున్న ఈడీ, ఐడీ రైట్స్ పై మేము సహకరిస్తాం కానీ.. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. మోడీ జీ మీరు తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు కవిత.
Gujarat Polls: సైకిల్ కు సిలిండర్ కట్టుకుని ఓటేసేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
