Site icon NTV Telugu

MLC Kavitha: గడువు దాకా వేచి చూస్తాం.. తర్వాత?

Trs Delhi

Trs Delhi

ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన రైతు నిర‌స‌న దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ దీక్షలో జాతీయ రైతు ఉద్యమ నాయ‌కుడు రాకేశ్ తికాయ‌త్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.తెలంగాణ నుంచి సుమారు 2 వేల కి.మీ. దూరం వ‌చ్చి దీక్ష చేస్తున్నాం. ఇంత దూరం వ‌చ్చి ఆందోళ‌న చేయ‌డానికి కార‌ణ‌మెవ‌రు? న‌రేంద్ర మోదీ ఎవ‌రితోనైనా పెట్టుకో.. కానీ రైతులతో మాత్రం పెట్టుకోవ‌ద్దు. ప్రభుత్వంలో ఎవ‌రూ శాశ్వతంగా ఉండ‌రన్నారు సీఎం కేసీఆర్. ఉద్యమాల పోరాట ఫ‌లితంగా 2014లో తెలంగాణ వ‌చ్చింద‌ని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రం వ‌చ్చాక రైతుల కోసం అనేక సంస్కర‌ణ‌లు తెచ్చామ‌ని తెలిపారు.

ఎమ్మెల్సీ కవిత కేంద్రం వైఖరిని తప్పుబట్టారు. ఢిల్లీలో ప్రజాప్రతినిధుల దీక్ష విజయవంతమయింది. ఇకనైనా బీజేపీ నేతలు కళ్ళు తెరవాలి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నీతిని అవలంభిస్తోంది. రైతుల నడ్డి విడిచేలా కేంద్రం వ్యవహరిస్తోంది. ఢిల్లీలో తాము ధర్నా చేస్తుంటే, హైదరాబాద్ లో బీజేపీ దొంగ దీక్ష చేస్తుంది. గతంలో వడ్లు తక్కువ వేయాలని మేం కోరాం. బీజేపీ నేతలు ప్రతి గింజ కొంటామని చెప్పారు. ముఖ్యమంత్రి పెట్టిన గడువు 24 గంటలు, అప్పటి వరకు వేచి చూద్దాం.

ఆ తర్వాత నిర్ణయం ఉంటుంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా, ప్రభుత్వాలు నిర్ణయాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు కవిత. ఇది రాజ్యాంగo కాదు. తెలంగాణలో పండిన అన్ని వడ్లు కొనాలన్నారు కవిత. కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్ర‌జులు, రైతులు సిద్ధంగా ఉన్నార‌ని, తాడోపేడో తేల్చుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు.కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు. 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేసీఆర్ డిమాండ్ చేశారు.

https://ntvtelugu.com/muralidharan-on-kcr-corruption-politics/

 

Exit mobile version