NTV Telugu Site icon

MLC Kavitha: రైతు బంధు ఆపింది కాంగ్రెస్సే.. రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకున్నారు

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: కాంగ్రెస్ నాయకులు వెంట బడి రైతు బందును ఆపించారని.. అభద్రతా భావంతోనే ఫిర్యాదు చేశారని.. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకున్నారని ఎమ్మెల్యే కవిత మండిపడ్డారు. ఉడతల దండులా.. బయట నేతలు తెలంగాణపై పడ్డట్లు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ నేతలంతా ఎక్కడ ఉన్నారు..? అని ప్రశ్నించారు. పార్ల మెంట్ లో ప్రధాని తెలంగాణ ఆవమానిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు అడ్డుకోలేదు..? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్రలో తెలంగాణ ప్రస్తావన తేలేదు అని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్నప్పుడు మన సమస్యలు పట్టని నాయకులు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు.? అని ప్రశ్నించారు. నిజామాబాద్ దండ యాత్రకు వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. 1000 బుల్ డోజర్లకు మా కారు ఒక్కటే సమాధానం అన్నారు. ట్రైలర్ చూసి జాతీయ పార్టీలు భయపడుతున్నాయని తెలిపారు. సింగరేణినీ ప్రైవేట్ కు కాంగ్రెస్ పార్టీ అప్పగించిందని అన్నారు. రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రియాంకా గాంధీ చదువుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధుపై మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు వెంట పడి రైతు బంధు ఆపారని మండిపడ్డారు. రైతులు కేసీఆర్ వైపు ఉన్నారని రైతు బంధు ఆపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Mohan Bhagwat: అప్పుడు అమెరికా మనల్ని ఎగతాళి చేసేది.. ఇప్పుడు పాకిస్థాన్‌..?

కాంగ్రెస్ రైతు వ్యతిరేకంగా వల్లే రైతు బంధు ఆగిందన్నారు. కాంగ్రెస్ నాయకులు వెంట బడి రైతు బందును ఆపించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభద్రతా భావంతోనే ఫిర్యాదు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకున్నారని తెలిపారు. నోటి కాడి బుక్కను లాక్కున్నారు కాబట్టి రైతులు ఆలోచించి ఓటు వేయాలని మండిపడ్డారు. బీజేపీతో మా శతృత్వం అన్నారు. కాంగ్రెస్ గుండాల ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ అని అంటున్న ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు. సింగరేణి ని ప్రైవేట్ కు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద వాళ్ళే బాగుపడ్డారని అన్నారు. కేంద్రంలో ఖాలీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాల్లో ఇంతవరకూ కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వలేదని.. యువత అడగాలని పిలుపు నిచ్చారు. మతం పేరుతో మంట పెట్టాలి అని ఒక పార్టీ చూస్తుందని, కులం పేరుతో చిచ్చు పెట్టాలని మరో పార్టీ చూస్తుందని అన్నారు. మంచోల్లు కావాలా ముంచే వాళ్లు కావాలా? అని ప్రశ్నించారు. ఇరిగేషన్ కావాలా మైగేశన్ కావాలా? 24 గంటల కరెంటు కావాలా 3 గంటల కరెంట్ కావాలా? అని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికులను ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించారు కేసీఆర్ అని తెలిపారు.
Health Tips : ఈ డ్రింక్ ను ఒక్కసారి తాగితే చాలు.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..