Site icon NTV Telugu

MLC Kalvakuntla Kavitha: రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు..

Kavitha

Kavitha

MLC Kalvakuntla Kavitha: రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్‌లో గణపతిని సందర్శించుకున్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టి, ఒడిదుడుకులు సృష్టించే ప్రయత్నం చేస్తు్న్నారని ఆమె మండిపడ్డారు. రాష్ట్రానికి ఆదాయం రాకుండా చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు.

Leaders On Governor Tamilisai: టార్గెట్ గవర్నర్.. ఏకమైన అధికార, ప్రతిపక్షాలు

ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ఆపాలని కొందరు ప్లాన్ చేస్తున్నారని కవిత అన్నారు. దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉండాలని ఆమె కోరుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఆగిపోవద్దని ఆమె వినాయకుడిని మొక్కుకున్నారు.

Exit mobile version