రైతుల విషయంలో కేసీఆర్ ఏం చేస్తారో చూద్దాం అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పంటకు కనీస మద్దతు ధర కల్పించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు. రాబోయే 2023-2024 ఆర్థిక సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి ఉండే అవకాశం లేదు. హరీష్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్ చివరి బడ్జెట్ అవుతుందన్నారు. చివరికి రుణమాఫీ కంటే వడ్డీ మాఫీ కార్యక్రమంగా నేను భావిస్తున్నా అన్నారు.
కేంద్రంపై ఎంత ఒత్తిడి చేస్తారో చేయండి అన్నారు జీవన్ రెడ్డి. ఛలో ఢిల్లీ అంటున్నావు కదా పద మేము సైతం నీతో వస్తాం. ఢిల్లీకి వెళ్లి జుట్టు పట్టుకుంటావో కాళ్ళు పట్టుకుంటావో ఎవరికి తెలుసు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనంగా చేయడానికి రాష్టంలో బీజేపీ తెరపైకి తెస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక బీజేపీ పార్టీని జనం నమ్మరు, తెలంగాణ వాసులు ఎవ్వరూ ఓటు వేయరు అన్నారు. మీ రాజకీయాలను పక్కన పెట్టండి. కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యతిరేక పార్టీ కేవలం బడా పారిశ్రామిక వేత్తల పార్టీ. బీడు పడిన భూములున్న రైతులకు ఎకరానికి10 వేల ఆర్థిక సహాయం అందించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
