NTV Telugu Site icon

MLC Jeevan Reddy: కర్ణుడు బయటకు వెళ్ళిపోయాడు.. అసెంబ్లీతో బంధం తెగిపోయింది

Mlc Jeevan Reddy

Mlc Jeevan Reddy

MLC Jeevan Reddy: కర్ణుడు బయటకు వెళ్ళిపోయాడు.. అసెంబ్లీ తో బంధం తెగిపోయిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను నిమిషాల్లోనే అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. రాజగోపాల రెడ్డి రాజీనామాను సమర్పించిన కొన్ని నిమిషాల్లోనే స్పీకర్ ఆమోదం తెలిపి, అధికారికంగా స్పీకర్‌ కార్యాలయం ప్రకటించడంతో ఆయన స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్ లో పంచ పాండవులు మిగిలారని, కర్ణుడు బయటకు వెళ్ళిపోయాడని, సిఎల్పీ నేత ధర్మరాజు, జగ్గారెడ్డి భీముడు, శ్రీధర్ బాబు అర్జునుడు అంటూ ప్రస్తావించారు. రాజగోపాల్ రెడ్డి కి అసెంబ్లీ తో బంధం తెగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. చచ్చిన టీఆర్‌ఎస్‌ నీ బతికించే పనిలో పడ్డారు రాజగోపాల్ రెడ్డి అంటూ తెలిపారు. టీఆర్‌ఎస్‌కి బలం పెంచుకునే అవకాశం ఇచ్చినట్టు అయ్యింది రాజగోపాల్ రెడ్డి రాజీనామా అని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు లో మేము గెలిస్తే అధికారం లోకి వచ్చినట్టే అని, అభ్యర్ధి నీ పీసీసీ నిర్ణయిస్తారని తెలిపారు.

read also: UDAN Scheme: ఉడాన్‌ పథకం ఘనత. ఐదేళ్లలో లక్షన్నరకు పైగా విమానాలు ప్రారంభం.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రజలు ఎలా చూస్తారు అనేది చూడాలని అన్నారు. రాజీనామా తో అభివృద్ధి అనేది కరెక్ట్ వ్యూహం కాదని జీవన్‌ రెడ్డి ప్రస్తావించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయడం అంటే చేత కానీ తనం అంటూ విమర్శించారు. అందరూ ప్రెసిడెంట్ కాలేరని ఎద్దేవ చేసారు. మూడేళ్లుగా రాజగోపాల్ రెడ్డి చేసిన ఉద్యమం ఏంటి? , ఎమ్మెల్యే గా ఉద్యమం చేస్తుంటే వద్దని కాంగ్రెస్ అన్నదా..? ప్రశ్నించారు జీవన్‌ రెడ్డి.

అయితే ఇవాళ ఉదయం ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ ను కలిసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కు అందించారు. అయితే ఈ విషయం పై స్పీకర్ కొన్ని నిమిషాల్లోనే ఆమోదించడంతో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. రాజగోపాల రెడ్డి రాజీనామాను సమర్పించిన కొన్ని నిమిషాల్లోనే స్పీకర్ ఆమోదం తెలిపి, అధికారికంగా స్పీకర్‌ కార్యాలయం ప్రకటించింది. రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. తన రాజీనామాను స్పీకర్‌ పోచారం ఆమోదించారని తెలిపిన విషయం తెలిసిందే.
Banjara Hills: దారుణం.. యువతిని బంధించి సెక్యూరిటీ గార్డ్‌ అత్యాచారం