Congress Senior Leader, MLC Jeevan Reddy Fired on CM KCR.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై అగ్రహం వ్యక్తం చేశారు. అయితే సీఎం కేసీఆర్ గతంలో ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత రూ.3 లక్షలు ఇళ్లు కట్టుకునేందుకు ఇస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్సందిస్తూ.. పేదలకు కేసీఆర్ ఇస్తానన్నిది డబుల్ బెడ్రూమ్ ఇళ్లా? లేక సింగిల్ బెడ్రూమ్ ఇళ్లా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఇళ్ల నిర్మాణాలకు రూ. 5 లక్షలు ఇస్తామని గతంలో చెప్పారని… ఇప్పుడు రూ. 3 లక్షలే ఇస్తామని చెపుతున్నారని మండిపడ్డారు.
రూ. 3 లక్షలకు ఎక్కడైనా ఇంటి నిర్మాణం పూర్తవుతుందా అని ఆయన ఎద్దేవా చేశారు. ఒక ఇల్లు కట్టాలంటే రూ. 10 లక్షలు కూడా సరిపోవని అన్నారు. అలాంటప్పుడు పేదలకు సహాయాన్ని పెంచాల్సింది పోయి, తగ్గించడం ఎంత వరకు సమంజసమన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చుడు.. గద్దెనెక్కినంక మాట తప్పుడు సీఎం కేసీఆర్ కు పరిపాటిగా మారిందన్నారు.