MLC Jeevan Reddy Comments On Munugodu Elections: మునుగోడు చుట్టూ జరుగుతోన్న రాజకీయ రాజకీయ వ్యవహారాలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించాడు. ఈరోజు, రేపు మునుగోడు సీటు తమదేనని అన్నాడు. అక్కడ ఓటు అడిగే హక్కు బీజేపీకి ఏమాత్రం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటునే కించపరిచేలా మోదీ మాట్లాడారన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలని.. ఆ రెండు పార్టీలు కలిసి పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు. మునుగోడు చుట్టూ నడుస్తోన్న వ్యవహారం కూడా ఒక పొలిటికల్ గేమ్ అని అభివర్ణించారు. ఇక రాజగోపాల్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో ఆయనకే తెలియదని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
మునుగోడులో తమదే అగ్రస్థానమన్న జీవన్ రెడ్డి.. రెండో స్థానంలో ఎవరుంటారో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలే తేల్చుకోవాలన్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజి సీట్లను బహిరంగ వేలానికి పెడుతున్నారని, తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్లు అమలు చేయకుండా, విద్యార్థుల హక్కుల్ని కాల రాస్తున్నారని ఆగ్రహించారు. తెలంగాణ విద్యార్థులకు 85 శాతం సీట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతకుముందు రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణ కాంగ్రెస్‌లో జీవన్ రెడ్డి అన్నారు. సీఎల్పీనేత భట్టివిక్రమార్కను ధర్మరాజుగా, ఎమ్మెల్యే జగ్గారెడ్డిని భీముడిగా, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును అర్జునుడిగా అభివర్ణించారు. నకులుడు, సహదేవుడు ఎవరో చెప్పని ఆయన.. రాజగోపాల్ రెడ్డిని కర్ణుడిగా పేర్కొన్నారు.
