సింగరేణిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన బొగ్గు వెలికితీతలో ప్రమాదం జరిగిందని కాంగ్రెస ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నలుగురు కార్మికులు గల్లంతు కావడం బాధాకరమని, 20రోజుల క్రితమే గని పైకప్పు లీకేజ్ అయ్యిందని ఆయన వెల్లడించారు. నీటి గుంత తీయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అర్ధమవుతుందని, యాజమాన్యం నిర్లక్ష్యం అని తెలుస్తుందని ఆయన ఆరోపించారు. పై కప్పు డామేజ్ ఐనా.. కార్మికులను పంపి బొగ్గు తీయడం దారుణమని, రీసెంట్ గా.. శ్రీరామ్ పూర్ మైన్ లో నలుగురు, మణుగూరు లో ముగ్గురు.. భూపాలపల్లి లో ఇద్దరు.. అర్జీ -3లో మళ్ళీ నలుగురు గల్లంతు ఇలా వరుసగా బొగ్గుగని కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన తెలిపారు.
సేఫ్టీ మేజర్స్ పాటించకుండా బొగ్గు తీయడం దారుణమని ఆయన విమర్శించారు. బాధ్యున అధికారులపై చర్యలు తీసుకోవాలని, రెగ్యులర్ గా చేసే ఆర్థిక సాయం కాకుండా ఒక్కొక కార్మికుడికి కోటి రూపాయలు, కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. డైరెక్టర్ జనరల్ మైన్స్ ను కోరుతున్నానని, లేఖను కూడా కాంగ్రెస్ పక్షాన రాస్తానన్నారు.
