Site icon NTV Telugu

MLA’s Poaching Case Update: ఎమ్మెల్యేల ఎర కేసు.. హాజరుకావాలని ఆనలుగురికి సిట్‌ నోటీసులు

Mla's Poaching Case Update

Mla's Poaching Case Update

MLA’s Poaching Case Update: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇవాళ విచారణకు రావాలని నలుగురికి సిట్‌ నోటీసులు పంపింది. ఇవాళ కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ లో ఉదయం 10.30 కు విచారించనుంది. ఇవాళ ఎమ్మెల్యే ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా నలుగురు కీలక నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించారణ జరపనుంది. అయితే.. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ఇప్పటికే సంతోష్, కేరళకు చెందిన డాక్టర్ జగ్గు స్వామి, కేరళలోని భారత ధర్మ జనసేన పార్టీ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి, కరీంనగర్ లాయర్ బూసరపు శ్రీనివాస్‌లకు సిట్ నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తులో వీరి వాంగ్మూలాలు కీలకమని పోలీసు అధికారులు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్‌లు నేడు సిట్ ఎదుట హాజరుకానున్నారు. వీరిని విచారిస్తే కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా సంతోష్ విచారణకు హాజరు కావాల్సి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నలుగురిలో ఎవరు సిట్ ముందు హాజరవుతారో అన్నవిషయంపై ఉత్కంఠ రేపుతుంది.

Read also: Karthika Masam : చివరి కార్తీక సోమవారం.. భక్తులతో ఆలయాలు కిటకిట

కేసు దర్యాప్తు పురోగతిని ఈ నెల 29లోగా హైకోర్టుకు సమర్పించాల్సి ఉన్నందున కీలక ఆధారాలను సేకరించాలని సిట్ భావిస్తోంది. గత నెల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైలట్‌ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగాకాంతరావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డిలను ప్రలోభపెట్టి బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్‌లను పోలీసులు అదే నెల 26న అరెస్టు చేశారు. తమ విచారణలో వెలుగు చూసిన వాస్తవాల ఆధారంగా నలుగురికి నోటీసులు జారీ చేసింది. వాటిని పరిష్కరించేందుకు సిట్ ఇప్పటికే ప్రశ్నావళిని సిద్ధం చేసింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో చర్చ జరిగిన రోజు రామచంద్ర భారతి ఫోన్‌లో తుషార్‌తో మాట్లాడింది. పైలట్ రోహిత్ రెడ్డితోనూ మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో తుషార్‌కు ఉన్న సంబంధాలపై విచారణ జరగనుంది. రామచంద్ర భారతి ఫోన్‌ నుంచి ‘సంతోష్‌ బీజేపీ’ పేరుతో ఓ నంబర్‌కు మెసేజ్‌లు వెళ్లాయి.

Read also: Srisailam Temple Rush: ముక్కంటి క్షేత్రంలో భక్తుల సందడి

వాటిలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన సమాచారం ఉంది. కానీ ఇప్పటి వరకు సంతోష్ దానిపై నోరు విప్పలేదు. ఇవాళ ఈ మెసేజ్‌లపై సంతోష్‌ను ప్రశ్నించనున్నారని సమాచారం. తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి సింహయాజీకి లాయర్ శ్రీనివాస్ విమాన టికెట్ బుక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే.. సింహయాజికి టికెట్ బుక్ చేసుకోవడం అవసరమా? అతనితో సంబంధాల అంశంపై ప్రశ్నించనున్నారు. తుషార్‌ను రామచంద్ర భారతికి పరిచయం చేసింది డాక్టర్ జగ్గుస్వామి అని టాక్‌. తుషార్‌, జగ్గుస్వామి ఇద్దరూ కేరళకు చెందిన వారు కావడంతో కుట్రలో వారి ప్రమేయంపై దర్యాప్తు చేయనున్నారు. ఇక, రామచంద్ర భారతి సంభాషణలో నంబర్ 1 , నంబర్ 2 అని ప్రస్తావన ఉంది. వారు ఎవరో అనేది స్పష్టం చేయడానికి సిట్ ఆరా తీస్తోంది.
Srisailam Temple Rush: ముక్కంటి క్షేత్రంలో భక్తుల సందడి

Exit mobile version