MLAs Poaching Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫామ్‌హౌస్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న నందకుమార్‌ను విచారించేందుకు నాంపల్లి కోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అనుమతి ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన కేసులో నందకుమార్‌ను ఈడీ ప్రశ్నించనుంది. రెండు రోజుల పాటు విచారణకు నాంపల్లి కోర్టు అనుమతించింది. అయితే క్రిస్మస్ సెలవులు ఉన్నందున ఈ నెల 26, 27 తేదీల్లో నందు కుమార్‌ను చంచల్‌గూడ జైలులో విచారించనున్నారు. బీజేపీలో చేరితే 100 కోట్లు ఇస్తానని రోహిత్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం కేసు నడుస్తోంది. ప్రస్తుతం సిట్ విచారణ నిలిచిపోయింది. ఏసీబీ..సిట్ దర్యాప్తు చేయాలా అనే అంశంపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా రోహిత్ రెడ్డికి నందకుమార్ వ్యాపార భాగస్వామి అని తేలింది. ఆర్థిక లావాదేవీలను గుర్తించారు. దీంతో ఈడీ పలువురిని ప్రశ్నించింది. ఇప్పుడు నందకుమార్‌ను ప్రశ్నించడం ద్వారా ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Read also: Medak Church: మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు.. భక్తుల రద్దీతో బయటనే ప్రార్థనలు
ఈడీ విచారణకు నాంపల్లి కోర్టు శనివారం అనుమతినిచ్చింది. మరోవైపు ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తుండగా.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, సెవెన్‌హిల్స్ మాణిక్‌చంద్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ అభిషేక్ అవలాలపై ఈడీ ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు సమాచార నివేదిక (ఈసీఐఆర్) నమోదు చేసింది.నంద కుమార్‌ను విచారించేందుకు అనుమతి రావడంతో ఏం జరగబోతుందనే ఆసక్తి నెలకొంది.
నందకుమార్ నోరు విప్పితే ఏమవుతుంది?
ఈడీ విచారణలో నందకుమార్ నోరు విప్పితే ఏమవుతుంది? అతను ఏ విషయాలు బయటపెడతాడు? మరి ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే కొనుగోలు కేసుతో ముడిపడిన మాణిక్‌చంద్ గుట్కా కేసుపై కూడా ఈడీ దృష్టి సారించే అవకాశం ఉంది. నందకుమార్ విచారణను చంచల్ గూడ జైలులోని వీడియో కెమెరాలో రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి, అతని సోదరుడికి సుదీర్ఘకాలంగా సంబంధాలున్నట్లు ఇప్పటికే విచారణలో తేలింది. వీరితో నందకుమార్ పలు వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఎమ్మెల్యేల ఎరతో పాటు మాణిక్‌చంద్ గుట్కా కేసుకు సంబంధించిన కీలక సమాచారం కూడా రాబట్టే అవకాశం ఉంది. నందకుమార్ సమాచారం, వెల్లడించిన పేర్ల ఆధారంగా ఈడీ మరింత దూకుడుగా ముందుకెళ్లే అవకాశం ఉంది.
Traffic Diversions: రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి.. 26 నుంచి 30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు