స్టేషనల్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇంటికి ప్రభుత్వ చీఫ్ విప్ హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ వెళ్లారు. రాజయ్య పార్టీ మారతారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఇంటికి వినయ్ భాస్కర్ వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. మా భేటీలో రాజకీయాలు లేవని, తోటి ఎమ్మెల్యే గా రాజయ్య ఇంటికి వచ్చానని తెలిపారు. ఇద్దరం కలిసి టీచర్స్ ప్రోగ్రాం లో కలిసి పాల్గొనాల్సి ఉందని, రాజయ్య ఎప్పటికీ బీఆర్ఎస్ కి విధేయుడేనని ఆయన అన్నారు. కేసీఆర్ కేటీఆర్ పైన రాజయ్య కి భరోసా ఉందని, రాజయ్య అంశం అధిష్టానం చేసుకుంటుందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే రాజయ్య పార్టీ మారను అని ఎప్పుడో చెప్పరని వినయ్ భాస్కర్ వెల్లడించారు.
Also Read : PM Modi: ఇండోనేషియా పర్యటనకు ప్రధాని.. ఆసియా సదస్సులో పాల్గొననున్న మోడీ
అంనంతరం.. రాజయ్య మాట్లాడుతూ.. నేను బీఆర్ ఎస్ పార్టీ మారడం లేదని, అది తప్పుడు ప్రచారమని ఆయన స్పష్టం చేశారు. వినయ్ భాస్కర్ కి నాకు ఉన్న అనుబంధంతో వినయ్ భాస్కర్ మా ఇంటికి వచ్చారని, నిన్న కేవలం మాదిగ సామాజిక వర్గం సంవేశానికి మాత్రం హాజరయ్యానని తెలిపారు. ఈ మాదిగ మేధావుల సమావేశానికి అన్ని పార్టీల వాళ్ళు వచ్చారని, మాదిగలు రాజకీయంగా ఎలా ఎదగాలి అనే అంశం లోనే ఆ సమావేశం లో చర్చ జరిగిందని ఆయన అన్నారు. దామోదర్ రాజా నర్సింహ తో భేటీలో రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదని, తనకు టికెట్ రానందుకు బాధగా ఉందని, అసంతృప్తి కాదన్నారు. నాకు కేటీఆర్ కేసీఆర్ పైన భరోసా ఉందని, జమిలి ఎన్నికకు అంటున్నారు.. ఏదైనా మార్పులు చేర్పులు జరగవచ్చు.. ఆశతో ఉన్నామన్నారు.
Also Read : Pappu Yadav: శ్రావణ మాసంలో మీరు పోర్న్ చూడలేదా..? మటన్ విందుపై వివాదం..