Site icon NTV Telugu

MLA Shivraj Patil : నా మాటలను టీఆర్‌ఎస్‌ రాజకీయంగా వాడుకుంటోంది

Mla Shivraj Patil

Mla Shivraj Patil

మహారాష్ట్ర రాయ్‌చూర్‌ నియోజకవర్గానికి చెందిన మీ బీజేపీ ఎమ్మెల్యేనే మా నియోజకవర్గాన్ని తెలంగాణ కలపంటున్నారని, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మాకు కావాలంటున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు సమయం దొరికినప్పుడల్లా తెలంగాణ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా రాయ్‌చూర్‌ ఎమ్మెల్యే శివ్‌రాజ్‌ పాటిల్‌ ఎన్టీవీతో మాట్లాడుతూ.. నేను ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడిన మాటలను టీఆర్ఎస్ వాళ్ళు రాజకీయానికి వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

అంతేకాకుండా నా నియోజకవర్గంకు ఎక్కువ పనులు, నిధులు మంజూరు కోసమే అలా మాట్లాడానని ఆయన పేర్కొన్నారు. మీరు చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుని రాజకీయం చేసుకోండి.. అంతేగాని మా పేరు చెప్పి రాజకీయ లబ్ది పొందుతున్నారని ఆయన మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాల కంటే కర్ణాటకలో మంచి పథకాలు అమలవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన జోస్యం చెప్పారు.

Exit mobile version