Site icon NTV Telugu

MLA Seethakka : చిన జీయర్ స్వామి ఏనాడైనా పేదల ఇళ్లకు వెళ్ళారా

Congress MLA Seethakka Fired on China Jeeyar Swamy.

ఇటీవల ఆథ్యాత్మిక గురువు చిన జీయర్‌ స్వామి చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. దీనిపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. చిన జీయర్ స్వామి ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క సారక్క ను అవమానించేలా మాట్లాడారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. దేవతల మీద దుర్మార్గంగా మాట్లాడారని, దీనిపై సీఎం స్పందించకపోవడం బాధాకరం..స్పందించాలని ఆమె డిమాండ్‌ చేశారు. పేదల ఇళ్లకు వంద గజాల జాగ దొరకడం లేదు.. మీకు మాత్రం వందల ఎకరాల స్థలం ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. జీయర్ స్వామి ఏనాడైనా పేదల ఇళ్లకు వెళ్ళారా.. అని ఆమె ధ్వజమెత్తారు.

ప్రకృతి దేవతల దర్శనం ఉచితంగా ఉంటుందని, సమతా మూర్తి దగ్గర ఈక్వాలిటీ ఉందా.. అక్కడ దర్శనం చేసుకోవాలంటే 150రూపాయల టికెట్ పెట్టారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదు, త్యాగాల పార్టీ అని ఆమె అన్నారు. గాంధీలది త్యాగాల కుటుంబమని, పక్కా పార్టీల పాచికలో భాగంగా రాహుల్ నాయకత్వం పై కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. మేము రాహుల్, సోనియా నాయకత్వంలోనే పనిచేస్తామని, పదవులు తీసుకోకుండా రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ను అధికారంలో కి తెచ్చారన్నారు.

Exit mobile version