తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి దళితబంధు పథకాన్ని నేడు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తన నియోజకవర్గంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు పథకం భారతదేశంలోనే బ్యాంక్ గ్యారెంటీ లేకుండా, ఎవరి షూరిటీ లేకుండా నేరుగా 10లక్షల రూపాయలు ఏకౌంట్ లో వేసే గొప్ప కార్యక్రమమన్నారు. తొలి ఏకాదశి, బక్రీద్ సందర్భంగా ఈ దళిత బంధు యూనిట్లను ప్రారంభించటం సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. మిగిలిన దళితులకు కూడా పూర్తిగా దళిత బంధు పథకం అందుతుందని స్పష్టం చేశారు సండ్ర. మరొక 1500 యూనిట్లు మన నియోజకవర్గానికి మాంజూరు అయ్యాయని, దళిత బంధు స్ఫూర్తి ని దెబ్బతీయకుండా ప్రభుత్వ అధికారులకు అప్పగించి పేదరికమే గీటు రాయిగా లబ్దిదారులని ఎంపిక చేయటం జరిగిందని ఆయన వెల్లడించారు. ఏ పథకం పెట్టినా అందరికి ఒకే సారి లబ్ది చేకూర్చలేము. అలాగే దళిత బంధు కూడా అందరికి చేకూరుతుంది కానీ ఒకే సారి అంటే సాధ్యపడే కార్యక్రమం కాదని ఆయన వివరించారు.
CI Nageshwar Rao : రాచకొండ పోలీసులను బురిడీ కొట్టిన నాగేశ్వర్ రావు
ఒకసారి లబ్ది పొందిన లబ్ధిదారుడు ఆర్ధికంగా నిలదొక్కుకొని మళ్లీ ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడకుండా ఎదగాలి అని కోరుకుంటున్నానన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం ఎస్సీలకు మాత్రమే కేటాయించిన కల్యాణ లక్ష్మి పథకం తర్వాత బీసీలకు తర్వాత మైనారిటీలకు ఆ తర్వాత పేదరికమే గీటురాయిగా ఏదిగి కులంతో సంబంధం లేకుండా అందరికి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమన్నారు. రేపు దళిత బంధు కూడా అందరికీ అందుతుందని ఆశిస్తున్నామన్నారు. సొంత స్థలాలలో ఇల్లు కట్టుకోవాలి అని అందరు కోరుకుంటున్నారు. దానికి విధి విధానాల రూపాకల్పన జరుగుతుంది. అలాగే 57సంవత్సరాలకే ఫింక్షన్ కు సంబందించి కూడా రూపాకల్పన జరుగుతుంది.ఇవి రెండు పూర్తి అయితే కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో పూర్తి అవుతాయి. ఆగస్టు 15 నుండి కొత్త లబ్ది దారులకు కొత్త పింఛన్ ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. విద్య వైద్యం పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి దవఖానాలు అభివృద్ది, మైనారిటీ పాఠశాలలు, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో పాఠశాలలు నిర్మించటం, గ్రామస్థాయిలో మన ఊరు మన బడి ద్వారా పాఠశాలల అభివృద్ది చేపట్టిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని ఆయన కొనియాడారు.
