NTV Telugu Site icon

Munawar Farukhi: మునవార్ ఫరుఖి షో కు అనుమతిస్తే అడ్డుకుంటాం.. బీజేవైఎం వార్నింగ్

Bjp Bjym Leaders

Bjp Bjym Leaders

మునవార్ ఫారుఖీ.. ఇతనొక స్టాండప్ కమెడియన్. ఎప్పుడైతే కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘లాకప్’ షోలో అడుగుపెట్టాడో, అప్పట్నుంచి అతని దశ తిరిగిపోయింది. ఆ షోలో తనదైన కామిక్ టైమింగ్, కవిత్వాలతో అందరి మనసులు దోచాడు. అందుకే, ఆ షో విన్నర్‌గా నిలిచాడు. దీంతో, అతనికి సర్వత్రా క్రేజ్ నెలకొంది. అతనితో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అతను హైదరాబాద్‌కి రాబోతున్నాడు. ఈనెల 20వ తేదీన ‘డోంగ్రీ టు నోవేర్’ పేరుతో ఓ లైవ్ షో ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఫారుఖీ ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంగా వెల్లడించిన విషయం తెలిసిందే.. అయితే దీనిపై సర్వత్రా ఉత్కంఠంగా మారింది. బీజేపీ, బీజేవైఎం నాయకులు.. ఫారుఖీ షోను అడ్డుకుంటామని, అనుమతి ఇవ్వకూడదని తెలిపారు.

ఒకవేళ అనుమతిస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై తెలంగాణ డిజీపీని గోల్కొండ జిల్లా అధ్యక్షుడు బీజేవైఎం నితిన్ నందకర్ కలిసారు. ఈ షో కు అనుమతిస్తే అడ్డుకుంటామని తెలిపారు. హైదరాబాద్ లో ఆగస్టు 20 న మునవార్ ఫరుఖి షో నిర్వహిచకూడదని తెలిపారు. గతంలో కేటీఆర్ ఈ షో కి అనుమతిచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు మరోసారి అనుమతి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో 20న షో జరిగితే అడ్డుకుంటామని అన్నారు. హిందువు దేవుళ్లను కించపరిచే విధంగా షో లో వాఖ్యలు ఉంటాయని పిర్యాదు చేశారు. ఈ షో ద్వారా హిందువులకు వ్యతిరేకంగా.. కమ్యునల్ ఇష్యూ జరుగుతుందని పిర్యాదు చేశారు. ఈ షో కు అనుమతి ఇవ్వకూడదని.. గోల్కొండ జిల్లా అధ్యక్షుడు బీజేవైఎం నితిన్ నందకర్ డీజీపీని కోరారు.

ఈ నేపథ్యంలోనే ఆగస్టు 11న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఫారుఖీ షో నిర్వహిస్తే, ఆ ప్రదేశాన్ని తగలబెట్టేస్తామని హెచ్చరించారు. అతని ఈవెంట్ నిర్వహించకుండా ఆపాలని తెలంగాణ ప్రభుత్వం, పోలీసు అధికారుల్ని కోరారు. అతడ్ని ఎవరైనా సహకరిస్తే, వాళ్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని తేల్చి చెప్పారు. గతంలో ఓ కార్యక్రమంలో భాగంగా సీతాదేవిపై ఫారుఖీ జోకులు వేసినందుకు వివాదాస్పదమైంది. కర్ణాటకలో అతడ్ని బ్యాన్ చేశారు. అందుకే, హైదరాబాద్‌లోనూ అతడి షోలు నిర్వహించకూడదని రాజాసింగ్ కోరుతున్నారు.
Telugu Flim Chamber : సాయంత్రం 5 గంటలకి ఛాంబర్ మీట్

Show comments