Site icon NTV Telugu

Raghunandan Rao: సచివాలయం ప్రారంభానికి ఆహ్వానం వచ్చింది.. కానీ నేను వెళ్ళను

Raghunanadan Rao

Raghunanadan Rao

Raghunandan Rao: సచివాలయం ప్రారంభానికి ఆహ్వానం వచ్చిందని కానీ వెళ్లడం లేదని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 30వ తేదీన నియోజకవర్గంలో పనులు ఉన్నాయని కావున సచివాలయం ప్రారంభానికి వెళ్లలేనని తెలిపారు. తప్పు చేసిన మంత్రులను సీఎం కేసీఆర్ వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. సీనియర్ మంత్రిపై ఆరోపణలు వస్థే ఎందుకు తొలగించడం లేదని మండిపడ్డారు. ఆ రోజు దారిన పోయే దానయ్య లు ఫిర్యాదు చేస్తే బిసి బిడ్డని మంత్రి వర్గం నుంచి తొలగించారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ రోజు బాధ్యతగల ఎమ్మెల్యే గా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోరా ? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు దళిత బంధు కమిషన్ తీసుకున్నారని చిట్టా ఉందని సీఎం కేసీఆర్ అంటున్నారని తెలిపారు. దళిత బంధు కమీషన్ తీసుకున్న ఎమ్మెల్యే ల పై దర్యాప్తు చేయిస్తారా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ACB… DG సుమోటోగా తీసుకొని కేసు దర్యాప్తు చేస్తారా ? అని ప్రశ్నించారు.

Read also: మీకు బట్టతల ఉందా? అయితే ఈ గింజలు వాడండి

డబుల్ బెడ్ రూంలో అవినీతి, దళిత బంధులో అవినీతి, మిషన్ భగీరథలో అవినీతి జరుగుతుందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇక్కడ అవినీతి సొమ్ముతో పక్క రాష్ట్ర పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి పై ఆరోపణలపై ఎందుకు విచారణ చేయడం లేదు? అని ప్రశ్నించారు. బీసీలకు ఒక న్యాయం, దళితులకు మరో న్యాయమా? అగ్రవర్ణ మంత్రికి ఇంకో న్యాయమా ? అని ప్రశ్నించారు. దళిత బందులో ఎమ్మేల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తులు సుమొటోగా తీసుకొని విచారించాలని డిమాండ్‌ చేశారు. ఏసీబీ డీజీ కి… సీఎం కేసీఆర్ ఆ అవినీతి చిట్టా పంపించాలని కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయం ప్రారంభానికి ఆహ్వానం వచ్చిందని అన్నారు. 30వ తేదీన నియోజకవర్గంలో పనులు ఉన్నాయని తెలిపారు. సచివాలయం ప్రారంభానికి నేను వెళ్ళడం లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సచివాలయానికి వస్తే మే ఒకటిన మొదటి దరఖాస్తు తీసుకొని నేనే వెళ్తా.. సీఎం కు ఇస్తా అని తెలిపారు.
Bonduc Nut: ఈ మొక్క మగవారికి దేవుడు ఇచ్చిన వరం

Exit mobile version