దళిత బంధు పథకంతో రాష్ట్రంలోని దళిత కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ దళిత బంధువు పథకం ద్వారా ఎంపికైన 57 మంది లబ్ధిదారులకు 5 కోట్ల 64 లక్షల రూపాయల వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి, డాక్టర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో పాలకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అదే అమలు పరుస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిందేనని ఆయన స్పష్టం చేశారు. దళితబంధు పథకంతో అర్థికాభివృద్ధి సాధించడంతో పాటు సమాజాన్ని నిర్దేశించే వ్యక్తులుగా పెరగాలని ఆయన ఆకాంక్షించారు.
శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితుల ఉద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే దళిత బంధు. దళితుల్లో ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించేందుకు దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది.
ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయం ద్వారా దళితులు ఎంట్రప్రెన్యూర్లుగా మారనున్నారు. దేశంలో ఉన్న ప్రస్తుత అన్ని స్కీమ్‌లలో కెల్లా అతిపెద్ద నగదు బదిలీ పథకం ఇదే కావడం విశేషం. ఈ స్కీమ్ పైలట్ ప్రాజెక్టు హుజురాబాద్‌లో ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది దశల వారీగా అమలవుతోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారమే దళిత బంధు పథకాన్ని రూ.1200 కోట్లతో అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టు 16, 2021 నుంచి ఈ స్కీమ్ ప్రారంభించారు.
Ladnapur Village: సింగరేణి నిర్వాసిత గ్రామం లద్నాపూర్ వాసుల నిరసన