Site icon NTV Telugu

Rohith Reddy: బండి సంజయ్‌కి సవాల్‌.. ఆ ఆరోపణలు రుజువు చేయాల్సిందే!

Pailla Rohith Reddy

Pailla Rohith Reddy

BRS MLA Pilot Rohith Reddy: ఇవాళ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హైదరాబాద్‌ పాత బస్తి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. బెంగుళూరు డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు వచ్చాయని అంటున్న బండి సంజయ్ కు సవాల్ విసిరారు. టార్గెట్ లో భాగంగానే నాకు ఈడి నోటీసులు ఇచ్చారని అన్నారు. బండి సంజయ్ చెప్పినట్టు నాకు ఈడి నోటీసులు వచ్చాయని తెలిపారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందని ఆరోపించారు. బీజేపీ వెయ్యి పడగల పాము అంటూ వ్యాఖ్యానించారు. కర్ణాటక డ్రగ్ కేసులో నాకు సంబంధం ఉందని బండి సంజయ్ అంటున్నారని మండిడ్డారు. అయ్యప్ప మాలలో ఉన్నానని.. ఒక హిందువుగా నేను సవాల్ విసురుతున్నా అన్నారు.

బండి సంజయ్ కు 24 గంటల సమయం ఇస్తున్నానని, నా పై చేసిన ఆరోపణలను భాగ్య లక్ష్మి అమ్మవారి ముందు బండి సంజయ్ రుజువు చెయ్యాలని అన్నారు. హిందూ వాదిగా చెబుతున్న కర్ణాటక పోలీసుల నుంచి నాకు ఎటువంటి నోటీసులు రాలేదని తెలిపారు. భాగ్య లక్ష్మి అమ్మవారి ముందు ప్రమాణం చేసి చెబుతున్నానని అన్నారు. రేపు ఇదే టైం కు నేను భాగ్య లక్షి అమ్మవారి వద్దకు వస్తా… బండి సంజయ్ కూడా రుజువులతో రావాలి సవాల్‌ విసిరారు. బండి సంజయ్ తడి బట్టలతో వచ్చి నాపై చేసిన ఆరోపణలు రుజువులు చూపాలని పేర్కొన్నారు. లేకుంటే బండి సంజయ్ అమ్మవారి ముందు తప్పు చేసినట్టు ఒప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read also: Andhra Pradesh: 2034లో చనిపోతా.. మరణ వేడుకలకు రావాలని మాజీ మంత్రి ఆహ్వానం

నిన్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది ఈడీ. వ్యాపార లావాదేవీలపై ఈడీ అధికారులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విచారించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈడీ నోటీసుపై ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి స్పదించారు. ఈడీ నా బయోడేటా అడగడం హాస్యాస్పదమన్నారు. ఇలాంటి నోటీసులు ఎప్పుడూ చూడలేదని న్యాయవాదులు అంటున్నట్లు తెలిపారు. బండి సంజయ్‌ చెప్పిన రెండు రోజలకే ఈడీ సమన్లు వచ్చాయని, బండి సంజయ్‌కి భవిష్యవాణి తెలుసా? నాకు నోటీసులు వచ్చే విషయం బండి సంజయ్‌కి ఎలా తెలుసని ఆయన ప్రశ్నించారు. ఈడీ, సీబీఐలు బండి సంజయ్‌ కింద పనిచేస్తున్నాయా అని ఆయన మండిపడ్డారు. మరి దీనిపై బండిసంజయ్ ఎలా స్పందిస్తారు? అనే విషయమై ఆశక్తి కరంగా మారింది.
West Bengal Strange Lights: ఆకాశంలో వింత.. స్పేస్‌షిప్ అంటూ జనాలు గిలిగింత

Exit mobile version