NTV Telugu Site icon

MLA Laxmareddy: తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ బాగు చూసేది మన కేసీఆర్ ప్రభుత్వమే..

Lakshma Reddy

Lakshma Reddy

MLA Laxmareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీ శ్రేణులు ప్రచారాలు, సభలు, సమావేశాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. పోలింగ్ కు ఇక 4 రోజులు సమయం ఉండటంతో ప్రచారంలో పార్టీ శ్రేణులు, నాయకులు దూసుకుపోతున్నారు. ప్రజలకు హామీలు ఇస్తూ ఇంటింటికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవాలని పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నారు. అయితే.. బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నేడు జడ్చర్ల మండలం పోలేపల్లి, మాచారం,గంగాపుర్ గ్రామాల్లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీజెపి పోటీ చేస్తుందని అన్నారు. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ బాగు చూసేది మన కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద నెలకు రూ.3 వేల ఆర్థిక సాయం, రూ.400కే గ్యాస్‌ సిలిండర్ అందించబోతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌, ఆరోగ్య లక్ష్మి, ఆరోగ్య మహిళా కేంద్రాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలతో మహిళలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో జడ్చర్ల అసెంబ్లీ ఈవిఎంపై సీరియల్ నెంబర్ 2 కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు.

Read also: Ashika Ranganath: ఈ అమ్మాయి బాగుంది కానీ ఆఫర్స్ అంతంత మాత్రమే…

తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి గడపకి ప్రభుత్వ సంక్షేమ ఫలం అందిందని ,అభివృద్ది చేసే ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ నవంబర్ 30న కారు గుర్తుకు ఓటువేసి అఖండ మెజారిటీ అందించాలని ప్రజలను కోరారు. గతంలో 11 సార్లు అధికారం ఇస్తే కనీసం తాగునీళ్లు కూడా ఇవ్వనోళ్లు ఇవాళ వచ్చి ఉచిత పథకాల పేరుతో హామీ ఇస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి రాగానే చేతులు ఎత్తేసారని ఆయన చెప్పారు. నిర్ణయాలు తీసుకునే అధికారం మన చేతిలో ఉండాలంటే బీఆర్ఎస్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని జడ్చర్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు. మళ్లీ మన కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడతల వారీగా పెన్షన్లు ఐదు వేలకు పెంచుతాం.. రైతు బంధును ఏడాదికి ఎకరాకో రూ. 16 వేలకు పెంచుతాం.. ప్రతి ఇంటికి ఐదు లక్షల కేసీఆర్ బీమా పథకాన్ని వర్తింపజేస్తాం.. గత తొమ్మిదేళ్ల పాలన చూసారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మీ ముందరే ఉన్నాయి.. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. ఎలక్షన్లప్పుడు వచ్చి ఉచిత హామీలు ఇచ్చే టూరిస్టుల మాటలు నమ్మి మోసపోయి గోసపడొద్దు అంటూ జడ్చర్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.
Ashika Ranganath: ఈ అమ్మాయి బాగుంది కానీ ఆఫర్స్ అంతంత మాత్రమే…