NTV Telugu Site icon

KP Vivekananda: రాజకీయాల్లో మోదీ కన్నా కేసీఆర్ సీనియర్

Kp Vivekananda

Kp Vivekananda

టీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ రచ్చ మొదలైంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు బీజేపీ పార్టీ, ప్రధాని మోదీతో పాటు తరుణ్ చుగ్ పై విరుచుకుపడుతున్నారు.

తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకనంద బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. పంజాబ్ లో ప్రజల చేత తిరస్కరించబడిన నేత తరుణ్ చుగ్ అని.. ఆయన కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. తరుణ్ చుగ్ మీ పనులు మీరు చూసుకోండి.. మా నాయకుడిపై బురద జల్లితే ఊరుకోం అని హెచ్చరించారు. మా ప్రభుత్వంపై మాట్లాడే స్థాయి తరుణ్ చుగ్ ది కాదని అన్నారు. బేవకూఫ్ మాటలు మాని, ఒళ్లు దగ్గర పెట్టుకొవాలని తరుణ్ చుగ్ కు వివేకనంద హెచ్చరించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్దకు వచ్చి మొక్కుడు కాదని.. ఏం నిధులు తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

మోదీ కన్నా 17 ఏళ్లు ముందే కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని.. అసెంబ్లీకి వెళ్లారని  రాజకీయాల్లో మోదీ కన్నా కేసీఆర్ సీనియర్ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మూడో స్థానమే అని విమర్శించారు. ఎంత మంది నేతలు వచ్చినా.. కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరని..బెంగాల్ లో కాళికను చూశారని..తెలంగానలో ఉగ్రనరసింహ స్వామిని చూస్తారని హెచ్చరించారు. తెలంగాణకు వస్తున్న మోదీకి చెప్పులతో స్వాగతం పలుకుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.