Site icon NTV Telugu

Jagga Reddy: గవర్నర్‌ ప్రసంగంపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

Jaggareddy

Jaggareddy

Jagga Reddy: గవర్నర్ ప్రసంగంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై బయట చాలా నరికిందని ఎద్దేవ చేశారు. పులి తీరుగా బయట గాండ్రించిందని అన్నారు. పిల్లి తీరుగా సభలో ప్రసంగం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా మైక్ కట్ కాగల్లా అని గవర్నర్ కూడా రాసింది చదివారని ఆరోపించారు. గత్యంతరం లేక మాట్లాడారని అన్నారు. గవర్నర్.. కేసీఆర్ మధ్య రాజీ కుదిరిందని తీవ్రంగా ఆరోపించారు. గవర్నర్ పెద్ద పెద్ద మాటలు చెప్పి.. ప్రసంగం తుస్ అనిపించిందని అన్నారు. బీఆర్‌ఎస్‌.. బీజేపీ కి గవర్నర్ బి.టీం గా మారిపోయిందని అన్నారు. ఇది ఎన్నికల ఇయర్ అని, అసెంబ్లీ లో మాట్లాడటానికి ఎన్నో సమస్యల్యూ ఉన్నాయన్నారు.

Read also: Tension at Gandhi Bhavan: గాంధీభవన్‌ వద్ద ఉద్రికత.. షబ్బీర్ అలీ, మల్లు రవి అరెస్ట్

సంగారెడ్డి సమస్యలతో పాటు.. రాష్ట్ర సమస్యలపై మాట్లాడతా అన్నారు. మెట్రో ట్రైన్ పఠాన్ చేరు నుండి సంగారెడ్డి.. సదాశివ పేట వరకు పొడగించాలని అన్నారు. యాదగిరిగుట్ట వరకు మెట్రో విస్తరించాలని తెలిపారు. పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర విభజన తరవాత పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చే జీవో రద్దు చేశారని తెలిపారు. అంగన్ వాడి, వీఆర్‌వ్వో.. ఐకేపీ ఉద్యోగులు, సర్పంచుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అనాథ పిల్లలకు హాస్టల్ వేస్తా అన్నారు కేసీఆర్.. అనాథ పిల్లలకు హాస్టల్ వసతి పై కూడా అడుగుతా? అన్నారు. గ్రామాల్లో.. ఆర్‌ఎంపీ వైద్యులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
K.A.Paul: నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది

Exit mobile version