NTV Telugu Site icon

MLA Jaggareddy : పోలీసులు యూనిఫామ్ విలువ కాపాడండి.. రాష్ట్ర డీజీపీ ఎక్కడ ఉన్నాడు..?

రామయంపేటలో ఆత్మహత్య చేసుకున్న సంతోష్ కుటుంబాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం పరామర్శించారు. సంతోష్ కుంటుంబానికి జరిగిన నష్టం ఎవరు పూడ్చలేనిదని, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ ఆత్మహత్య చేసుకొని నాలుగు రోజులు గడుస్తున్న నిందితులను అరెస్ట్ చేయకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. నిందితులపై సెక్షన్ 306తో పాటు 302,307 సెక్షన్లు కూడా పెట్టాలన్నారు. ఆత్మహత్య జరిగి నాలుగు రోజులు అవుతున్న జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నట్లు..? అని ఆయన ప్రశ్నించారు. ఈరోజు నిందితులను పార్టీ నుండి సస్పెండ్ చేయకపోయిన, అరెస్ట్ చేయకపోయిన రేపు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తాం.. రేపు నేనే స్వయంగా వచ్చి రామయంపేట పోలీస్ స్టేషన్ ముందుకు వస్తామని ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో హోమ్ మినిష్టర్ ఎక్కడ ఉన్నాడు.? నిందితులకు 6 నెలల వరకు బెయిల్ రాకుండా చూడాలన్నారు. నిందితులు విడుదల చేసిన వీడియోలో నిందితుల ముఖంలో ఎక్కడ పశ్చాతాపం లేదని, పోలీసులు మీరు వేసుకున్న యూనిఫామ్ విలువ కాపాడండి. రాష్ట్ర డీజీపీ ఎక్కడ ఉన్నాడు..? అని ఆయన మండిపడ్డారు. గతంలో సంతోష్ తనకు జరుగుతున్న అన్యాయం పై ఎంతో మందికి ఫిర్యాదు చేసినా.. ఎవరు అతని ఫిర్యాదుల పై స్పందించలేదన్నారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీని సస్పెండ్ చేయాలన్నారు. ఈ రోజు రాత్రి వరకు నిందితులను అరెస్టు చేయకపోతే రేపు ఉదయం 11గంటలకు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామాయంపేట లో పోలీస్ స్టేషన్ ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేస్తామంటూ హెచ్చరించారు.