Site icon NTV Telugu

MLA Jaggareddy : అలా చేస్తే నేను టీఆర్‌ఎస్‌లో చేరుతా..

Congress MLA Jaggareddy Made Sensational Comments On Joining on TRS.

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా సోమ‌వారం నాడు అసెంబ్లీ ఆవరణలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిల‌తో క‌లిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలన సృష్టించిన విషయం తెలిసింది. అంతేకాకుండ ఆయన టీఆర్‌ఎస్‌లో చేరతారని వార్తలు గుప్పుమనడంతో.. కాంగ్రెస్‌ను వీడే ప్రస్తక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

అయితే నేడు మరోమారు ఆ ప్రశ్న ఎదురుకావడంతో.. తెలంగాణ ఉద్యమ సమయంలో కొట్లాడిన జర్నలిస్టులకు ఇళ్లు, జాగ్వార్‌ కార్లు ఇస్తే నేను టీఆర్‌ఎస్‌లోకి చేరుతానన్నారు. అంతేకాకుండా జ‌ర్న‌లిస్టుల ఇళ్ల గృహ ప్రవేశం కాగానే తాను టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వస్తానని ఆయ‌న చెప్పారు. తాను డిమాండ్ చేసినట్లుగా జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్లు ఇస్తే ఒక టర్మ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ కూడా చేయనని ఆయ‌న‌ ప్రకటించారు. జ‌గ్గారెడ్డి నోట నుంచి వ‌చ్చిన ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో ప్రస్తుతం వైర‌ల్‌గా మారాయి.

https://ntvtelugu.com/ts-assembly-budget-sessions-monday-updates/

Exit mobile version