Site icon NTV Telugu

CLP Meeting : బాయ్‌కాట్‌ చేసిన జగ్గారెడ్డి

కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అడుగడుగునా అడ్డంకులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు కాంగ్రెస్‌ సీఎల్పీ సమావేశం నిర్వహించారు. అయితే సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు చేదు అనుభవం ఎదురైందని, తనను అవమానించేవాడు కాంగ్రెస్‌లో ఎవడూ లేడని అన్నారు. అంతేకాకుండా మెదక్‌ జిల్లాకు వెళితే పీసీసీ సమాచారం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.

ఈ పద్ధతి తనకు నచ్చడం లేదని, ఈ సీఎల్పీ సమావేశానికి అంతరాయం కలగకూడదనే తాను సమావేశం నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా చాలా విషయాలు మాట్లాడడానికి సమావేశానికి వచ్చానని, కానీ .. ఈ సమావేశంలో పార్టీకి సబంధించిన విషయాలు తప్పా మరోటి మాట్లాడే సందర్భం కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కి సూచించడంతో సమావేశం నుంచి వెళ్లిపోతున్నట్లు ఆయన తెలిపారు.

https://ntvtelugu.com/uttam-kumar-reddy-made-sensational-comments/
Exit mobile version