Site icon NTV Telugu

MLA Jagga Reddy : త్వరలో పార్టీకి రాజీనామా చేస్తున్న

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా ఎపిసోడ్‌కు తెరపడినట్లు కనిపిస్తుంది. తాజా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కాసేపట్లో సోనియా గాంధీకి జగ్గారెడ్డి లేఖ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా త్వరలో పార్టీకి రాజీనామా చేస్తున్నానని, అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని ఆయన స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని ఆయన వెల్లడించారు. పార్టీలో ఎవరు మాట్లాడలేని సందర్భంలో రాహుల్ గాంధీ సభ పెట్టించానని ఆయన తెలిపారు. నా భార్య నీ ఎమ్మెల్సీ బరిలో నిలబెట్టానని, పార్టీ కోసం పని చేస్తుంటే.. సోషల్ మీడియాలో నన్ను కోవర్ట్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నా వల్ల పార్టీ ఇబ్బంది పడుతుంది అనే కలర్ ఇస్తున్నారని, అవమానం బరిస్తు పార్టీలో ఉండలేనని ఆయన అన్నారు. త్వరలోనే మీకు రాజీనామా లు పంపుతానని సోనియా గాంధీకి ఇచ్చే లేఖలో జగ్గారెడ్డి పేర్కొన్నారు. అయితే రేవంత్‌ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైననాటి నుంచి టీ కాంగ్రెస్‌లో క్రియాశీలక కార్యక్రమాలకు జగ్గారెడ్డి కొంచెం దూరంగానే ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడి స్థానం కోనం ఆశపడి భంగపడడంతో.. టీకాంగ్రెస్‌లో తనదైన శైలిలో జగ్గారెడ్డి పాల్గొనడం లేదని టీకాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.

https://ntvtelugu.com/99-per-cent-of-national-highways-have-been-increased/
Exit mobile version