Site icon NTV Telugu

హాజరు కాలేకపోతున్నా.. అసత్య ప్రచారాలు వద్దు!

రేపు జరుగబోయే ఇంద్రవెల్లి దండోరా సభకు హాజరు కాలేకపోతున్నానంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. సభకు హాజరుకాలేదని ఎవరు తప్పుడు ప్రచారం చెయ్యెద్దని.. ముందుగానే వివరణ ఇస్తున్నాను అని జగ్గారెడ్డి చెప్పారు. గతం వారం రోజులుగా జ్వరంగా ఉంది. అందుకే కోర్ట్ కు కూడా హాజరు కాలేకపోయాను. వారెంట్ కూడా వచ్చింది. ఈ కారణంగానే సోమవారం జరగనున్న ఇంద్రవెల్లి దండోరా సభకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు.

సమన్వయకర్తగా సభ ఏర్పాట్లపై ఇప్పటికే పలుమార్లు చర్చించానని వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రస్తుత నాలుగు జిల్లాలకు సంబంధించిన డీసీసీ ప్రెసిడెంట్ లతో సభకు సంబంధించిన అంశాల పై మాట్లాడడం జరిగింది.. అలాగే ఎమ్మెల్యే సితక్కతో కూడా మాట్లాడడం జరిగింది.. ఫీల్డ్ లో ప్రేమ్ సాగర్ రావుతో పాటు వీరందరూ సభకు సంబంధించిన జన సమీకరణ, సభ ఏర్పాట్లు ఇతర అంశాలు చూస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు.

Exit mobile version