Site icon NTV Telugu

Congress: పదవుల కోతపై స్పందించిన జగ్గారెడ్డి..

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో హీట్‌ పుట్టించిన జగ్గారెడ్డి ఇష్యూ చల్లబడినట్టే అనిపించింది.. అయితే, జగ్గారెడ్డి పదవులకు కోత విధిస్తూ తెలంగాణ పీసీసీ తీసుకున్న నిర్ణయంతో.. మరోసారి పార్టీలో కాక రాజేసినట్టు అయ్యింది.. ఇక, ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. మరోవైపు పీసీసీ చర్యపై మీడియాతో మాట్లాడేందుకు సిద్ధం అవుతున్నారు జగ్గారెడ్డి.. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా ప్రతినిధులు ఓసారి జగ్గారెడ్డిని ప్రశ్నించారు.. ప్రస్తుతం నాతో భట్టి, ఉత్తమ్‌ సహా ఎవరూ మాట్లాడట్లేదన్న ఆయన.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాతో మాట్లాడేందుకు భయపడుతున్నట్లున్నారని వ్యాఖ్యానించారు.. ఇక, రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి అంటే ఏంటో తెలియాలంటూ హాట్‌ కామెంట్లు చేశారు జగ్గారెడ్డి.

Read Also: Farm Laws: నిపుణుల కమిటీ నివేదిక బహిర్గతం.. ఏముందంటే..?

అయితే, తనకు ఢిల్లీ నుంచి ఎలాంటి పిలుపు రాలేదన్న ఆయన.. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలనే అనుకుంటాను అని మరోసారి స్పష్టం చేశారు జగ్గారెడ్డి… కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వాన్ని సమర్థిస్తానన్న ఆయన.. మొన్న తాను కొంత వ్యక్తిగతంగా మాట్లాడిఉంటే కొంత వరకు నొచ్చుకొని ఉంటారన్న ఆయన.. ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.. ఇక, కాంగ్రెస్ పార్టీలోనే తప్పు ఒప్పులు మాట్లాడుకునే వీలు ఉంటుందన్నారు జగ్గారెడ్డి.. అంతేకాదు, పదవుల కోత అనేది కూడా స్పోర్టివ్‌గా తీసుకుంటానని వెల్లడించారు. అయితే, మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న జగ్గారెడ్డి.. ఇంకా… ఏదైనా సంచలన ప్రకటన చేస్తారా? వెనక్కి తగ్గుతారా? అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

Exit mobile version