Site icon NTV Telugu

MLA Jagga Reddy : రెమిడిసవర్‌ మొత్తం బ్లాక్ దందా జరిగింది

Jaggareddy

Jaggareddy

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. కరోనా సమయంలో రెమిడిసవర్‌పై భారీ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హెటిరో డ్రగ్స్ .. పార్థ సారథి రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి… అడగాల్సి వస్తుందని, కరోనాలో రెమిడిసవర్‌ ఇంజెక్షన్ జనం ప్రాణాలు కాపాడుతుంది అని గొప్పగా ఫీల్ అయ్యానన్నారు. దేశం మొత్తం దాని చుట్టే తిరిగింది, చాలా ప్రచారం జరిగిందన్నారు. రెమిడిసవర్‌లో కేంద్రం..రాష్ట్రం కీలక పాత్ర పోషించారన్న జగ్గారెడ్డి.. రెండు ప్రభుత్వాల అండతోనే మాఫియా జరిగిందని ఆరోపించారు. ఐటీ రైడ్ జరిగినప్పుడు 500 కోట్లు ఏమయ్యాయో.. అనేది ఇప్పటికీ బయటకు రాలేదన్నారు. రెమిడిసవర్‌లో మొత్తం బ్లాక్ దందా జరిగిందని, ప్రతి ఇంజెక్షన్ లక్ష వరకు అమ్మారని ఆయన మండిపడ్డారు.

500 కోట్లు కాదు.. 10 వేల కోట్ల వరకు ఐటీ రైడ్ లో బయట పడి ఉంటాయని ఆయన అన్నారు. . రెమిడిసవర్‌ను ప్రభుత్వాలు ఎందుకు కొని ప్రజలకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. చేసిన స్కాం తేలాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యసభలో నీ నామినేషన్ వేసే లోపు సమాధానం చెప్పాలి పార్థసారథిని ప్రశ్నించారు. ప్రభుత్వం దాడులు చేయిస్తుంది… మళ్లీ బ్లాక్ మెయిల్ చేస్తుంది. రెమిడిసవర్‌కి అనుమతి ఇచ్చింది ఎవరు..? మూడు నెలల తర్వాత మళ్లీ దాన్ని తీసుకోవద్దు అని ఎందుకు రద్దు చేశారు..? అని ఆయన ప్రశ్నించారు. ఫార్మా మాఫియా దీని వెనకాల ఉందని, మనషుల ప్రాణాలతో సొమ్ము చేసుకున్న వ్యక్తికి రాజ్యసభ ఇస్తారా..? అని ఆయన మండిపడ్డారు.

Exit mobile version