చెన్నమనేని పౌరసత్వ వివాదంపై నేడు హైకోర్టు విచారణ…

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ పౌరసత్వ వివాదం పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇప్పటికే చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నట్లు అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం. అయితే… కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసారు చెన్నమనేని రమేష్‌. ఈ నేపథ్యంలోనే కౌంటర్ పిటిషన్ పై నేడు వాదనలు విననుంది హైకోర్టు. అయితే… ఇవాళ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కాగా.. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌పై గత కొంత కాలంగా పౌరసత్వ వివాదం రాజుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో వేములవాడ కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌… చెన్నమనేని రమేష్‌ పౌరసత్వంపై పిటిషన్‌ వేశారు.