Site icon NTV Telugu

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ నాటకంలో ఓ భాగం…

బీజేపీ ఆడిస్తున్న నాటకంలో ఒక భాగం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. లాభం జరిగే దళిత వర్గాలకు నష్టం కలిగే కుట్ర బీజేపీ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళను వాడుకొని చేస్తోంది. కేవలం రాజకీయ విమర్శల కోసం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు అని తెలిపారు.

ఆ తర్వాత ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ… ప్రవీణ్ కుమార్ కలలు కలగానే మిగిలిపోతుంది. ప్రవీణ్ కుమార్ ఆయన ఎజెండా చెప్పాలి!. అర్థం పర్థం లేకుండా ప్రవీణ్ కుమార్ కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. స్వేరో నుంచి మొన్న నాగార్జున సాగర్ లో పోటీ చేసిన అభ్యర్థికి 3వేల ఓట్లు వచ్చాయి. దళితులకు- బౌజన సమాజం కోసం ప్రవీణ్ కుమార్ ప్రణాళిక విడుదల చెయ్యాలి అని పేర్కొన్నారు. కేసీఆర్ నచ్చనపుడు ఆయన కింద ప్రవీణ్ ఎందుకు ఇంతకాలం పని చేశారు. జేపీ ,జేడీ లక్ష్మీనారాయణ లాగే ప్రవీణ్ పరిస్థితి ఉంటుంది అని స్పష్టం చేసారు.

Exit mobile version