Site icon NTV Telugu

ఎంపీ ఆరవింద్ పై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ ఫైర్…

నిజామాబాద్ ఎంపీ ఆరవింద్ పై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ ఫైర్ అయ్యారు. అవివేక ప్రకటనలు చెస్తున్న ఎంపీ అరవింద్, చిత్తశుద్ధి ఉంటె పసుపు బోర్డు కోసం ధర్నా చేస్తే తెరాస పుర్తిగా మద్దతు ఇస్తది. ఆరవింద్ తప్పుడు ఆరోపణలను ప్రజలు ఎప్పటినుంచో గమనిస్తున్నారు. త్వరలోనే బుద్ధిచెపుతారు. మాధవనగర్ రైల్వే బ్రడ్జి నిర్మాణ విషయంలొ ఆరవింద్ పొలిటికల్ జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. 2020 నవంబర్లో బ్రిడ్జి నిర్మాణ ప్రకటనచేసిన కేంద్రం ఇప్పటివరకు బడ్జెట్ విడుదల చేయలేదు. చేతులు తక్కువ మాటలు ఎక్కువ. ఎంపీకి చిత్తశుద్ధవుంటే.. అతిపెద్ద నిజమాబాద్ రైల్వే జంక్షన్ కు డబుల్ రైల్వే రైల్ లైన్ ఎందుకు మంజూరు చేయించలేకపోయారు అని ప్రశ్నించారు.

Exit mobile version