తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతోందని, మత్స్యకారులు ఆర్థిక పురోగతి కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. వరంగల్ జిల్లా వర్ధన్నపేటమండలం దమ్మపేట గ్రామ చెరువులో ఒక లక్ష 76 వేల సబ్సిడీ చేప పిల్లలను ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వదిలారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల ఆర్థిక పురోగతి కోసం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు.
Read Also: Tollywood: మళ్ళీ తెలుగు సినిమాకు ‘డబ్బింగ్ దడ’!
తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో చేపల పంపిణీ కార్యక్రమం వల్ల మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని తెలిపారు. మత్స్యకారులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి భరోసాను కల్పించిందన్నారు. చేపల పెంపకాన్ని వదిలి ఏదో ఒక కూలీ పని చేస్తూ బతుకునీడుస్తున్న మత్స్యకారుల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ తిరిగి వెలుగులు నింపారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పేదలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎమ్మెల్యే ఆరూరి రమేష్.
Read Also: CM Jagan: రైతుల ధాన్యం సేకరణను అధికారులందరూ సవాల్‌గా తీసుకోవాలి