Extra Marital Affair : మియాపూర్ లో దారుణం.. భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య.!
- అక్రమ సంబంధం కోసం భర్త హత్య
- మిస్సింగ్ కేసు వెనుక షాకింగ్ ట్విస్ట్
- CDR, CCTVతో బయటపడిన నిజం
- మహారాష్ట్రలో వెలికితీసిన మృతదేహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extra Marital Affair : హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత కిరాతకమైన ఉదంతం వెలుగుచూసింది. పరాయి పురుషుడితో ఉన్న అక్రమ సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే నెపంతో ఒక భార్య, తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసి శవాన్ని పూడ్చిపెట్టింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నటిస్తూ.. తన భర్త కనిపించడం లేదంటూ గతేడాది నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు అప్పట్లో మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
- OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?
అయితే పోలీసుల లోతైన దర్యాప్తులో భాగంగా సదరు మహిళ కాల్ డేటా రికార్డులను (CDR) , ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించగా అసలు నిజం బయటపడింది. భార్యే తన ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిందని, అనంతరం ఆధారాలు దొరక్కుండా శవాన్ని వాహనంలో మహారాష్ట్ర సరిహద్దుల (బార్డర్) వరకు తరలించి అక్కడ గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘాతుకానికి సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, తాజాగా మహారాష్ట్రలోని స్థానిక పోలీసుల సహాయంతో నిందితుడు చూపించిన ప్రాంతంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?