Site icon NTV Telugu

Harish Rao-KTR: సిద్దిపేటలో ఐటీ హబ్‌.. ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు

Harish Rao

Harish Rao

Harish Rao-KTR: సిద్దిపేటలో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని నాగులబండలో రూ.63 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్‌ను మంత్రి హరీష్ రావుతో కలిసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఐటీ టవర్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉపయోగపడుతుందని తెలిపారు. పరోక్షంగా 4 వేల మందికి ఉపాధి అందుతుందని అన్నారు. 15 అంతర్జాతీయ కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయని వెల్లడించారు.

Read also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

ఇంతకు ముందు పట్టణ శివారు ఇర్కోడులో రూ.6కోట్లతో నూతనంగా నిర్మించిన ఆధునిక కబేళా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మహిళా ఉత్పత్తులు, ఇర్కోడ్ నాన్ వెజ్ ఆకుకూరలు, పంచాయతీరాజ్ శాఖ సేంద్రీయ ఎరువుల స్టాళ్లను ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట పట్టణంలో బిటి, సిసి రోడ్లు, నర్సాపూర్ కప్పలకుంటలో సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నర్సాపూర్‌లో తాగునీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేశారు. స్వచ్ఛ బడిని సందర్శించారు. అనంతరం బహిరంగ సభలో మంత్రులు పాల్గొని మాట్లాడనున్నారు.
T Series: టాలీవుడ్ పై కన్నేసిన టీ సిరీస్.. హైదరాబాద్ లో పాగా!

Exit mobile version