Minister Vivek : తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదం చెలరేగింది. మంత్రి వివేక్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సహ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై ఆయన చేసిన విమర్శలు సంచలనంగా నిలిచాయి. నిజామాబాద్‌లో మీడియాతో మంత్రి వివేక్ మాట్లాడుతూ.. “నేను కష్టపడి పనిచేస్తున్నా, నాపై కుట్రలు జరుగుతున్నాయి. కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ కుట్రల వెనుక ఎవరో నాకు తెలుసు,” అని వ్యాఖ్యానించారు.
“మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను రెచ్చగొట్టి నాపై విమర్శలు చేయిస్తున్నారు. లక్ష్మణ్ నాపై ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నేను ఆయనపై ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. రాజకీయాల్లో లక్ష్మణ్‌ను ప్రోత్సహించింది మా నాన్నగారే,” అని వివేక్ చెప్పారు. తనపై వస్తున్న వదంతులపై మంత్రి వివేక్ స్పష్టతనిచ్చారు.
“లక్ష్మణ్ వస్తే నేను వెళ్లిపోతాననేది పూర్తిగా అబద్ధం. అలాంటి వ్యాఖ్య నేను ఎప్పుడూ చేయలేదు. నన్ను తప్పుగా చూపించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు,” అని వివేక్ చెప్పారు. “నాది మాల జాతి అని విమర్శించడం చాలా బాధాకరం. జాతి పేరుతో రాజకీయాలు చేయడం తగదు. మనం ప్రజాసేవ కోసం ఉన్నాం, విభజన కోసం కాదు,” అని మంత్రి వివేక్ అన్నారు.
