Site icon NTV Telugu

ధరణిలో రిజిస్టర్ అయిన భూములకు ఏ సమస్యలు ఉండవు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కబ్జాలు లేవు, రౌడీ షీటర్లు లేరు. లా అండ్ ఆర్డర్ బాగుంది కాబట్టి అన్ని పరిశ్రమలు తరలివస్తున్నాయి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 15వేల ఐటీ కంపెనీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఆర్ఆర్ఆర్ రాబోతుంది.సెంట్రల్ ప్రభుత్వం తో మాట్లాడుతున్నాం.. ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారు. తద్వారా ఈ రంగం మరింత అభివృద్ధి సాధిస్తుంది అని తెలిపారు.

రీజనల్ రింగ్ రోడ్(RRR) విషయంలో లాండ్ సేకరణ 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళుతున్నారు. రియల్ ఎస్టేట్ లో మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా నిర్మాణాలు రూపొందాలి. ఎల్లకాలం ఈ ఇండస్ట్రీ బాగుండాలంటే మధ్యతరగతి ప్రజలను బాగస్వామ్యం అయ్యేలా చూడాలి. మీ సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్తాను. ధరణి లో రిజిస్టర్ అయిన భూములకు రైతులకు ఎలాంటి సమస్యలు ఉండవు అని పేర్కొన్నారు.

Exit mobile version