Site icon NTV Telugu

Minister Uttam Kumar: త్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం..

Uttamkumar Reddy

Uttamkumar Reddy

Minister Uttam Kumar: అతి త్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టుకు రావడం ఆనందంగా ఉందని, దేశ చరిత్రలోనే 100 ఏళ్ల చరిత్ర గల ప్రాజెక్ట్ నిజాంసాగర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 10 ఏళ్లలో 1.81 లక్షల కోట్ల అప్పు చేసి ఇరిగేషన్ మీద ఖర్చు చేసిందని తెలిపారు. పాలమూరు, సీతారాం ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ల నుంచి ఒక ఎకరంకు కూడా నీళ్ళు పారలేదన్నారు. గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్ట్‌లు కూలిపోయాయని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ సంవత్సరం రూ.22,500 కోట్లను ఇరిగేషన్ మీద ఖర్చు చేస్తున్నామన్నారు.

Read also: Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్, నాన్ బెయిలబుల్ కేసు నమోదు

జాతీయ నీటి సంఘం ఇచ్చిన ఆదేశాలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్నా మూడు బ్యారేజ్‌లలో నీళ్ళు వినియోగించలేదని అన్నారు. కాళేశ్వరం నీటిని సముద్రంలో వదిలేశామన్నారు. కాళేశ్వరం నీటిని వాడకుండా అత్యధికంగా వరి దిగుబడిని సాధించామన్నారు. కేబినెట్ మంత్రులంతా రైతుల సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తున్నామని తెలిపారు. నాగ మడుగు ఎత్తిపోతల పథకంను పూర్తి చేస్తామని తెలిపారు. లెండి ప్రాజెక్ట్ పూర్తి అయ్యేందుకు చర్యలు తీసుకుంట అన్నారు.
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. 10 నెలల్లో 55 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రవేట్ రంగంలో యువతకు ఉపాధి కలిగేలా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని అన్నారు. అనవసర విమర్శులు చేసే వారిని పట్టించుకోమన్నారు. జర్నలిస్టులకు మా మద్దతు ఉంటదని మంత్రి తెలిపారు.
Ponguleti Srinivasa Reddy: ఇందిరమ్మ ఇంటికి మొదటి విడతగా లక్ష రూపాయలు..

Exit mobile version