NTV Telugu Site icon

Ministers Tour : రేపు నల్గొండ జిల్లాలో మంత్రుల పర్యటన

Bhatti

Bhatti

రేపు నల్గొండ జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు పరిశీలించనున్నారు. అమెరికాలోని రాబిన్ సన్ సంస్థ నూతన టెక్నాలజీని వాడాలని ప్రభుత్వం నిర్ణయింది. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాల్లో SLBC పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఖర్చుకు వెనుకాడేది లేదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అయితే మరోవైపు.. నూతన టెక్నాలజీతో ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉందంటుని అధికార వర్గాలు వెల్లడించాయి. రేపు కేబినెట్‌లో ఎజెండాగా SLBC అంశంపై చర్చ జరుగనుంది. అయితే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై వివక్ష చూపిందని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. ఈ నెల 20న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల SLBC టన్నెల్ పరిశీలన, ఇరిగేషన్ అధికారులతో సమీక్షతో నల్గొండ జిల్లా ప్రాజెక్టుల దశ మారనుందని ఎమ్మెల్యే బాలు నాయక్‌ అన్నారు.

Rishabh Pant Angry: నన్నెందుకు కొడుతున్నారు.. బంగ్లా ప్లేయర్‌పై పంత్ ఆగ్రహం!

Show comments