Site icon NTV Telugu

Talasani Srinivas Yadav: స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ సీజ్‌.. ఘటనపై తలసాని సీరియస్‌

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav: సికింద్రాబాద్‌ స్వప్న లోక్ అగ్నిప్రమాద మృతుల కుటుంబ సభ్యులను గాంధీ ఆస్పత్రిలో హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ పరామర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపు నుంచి మంత్రి తలసాని ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతిచెందిన బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటామని హామీ ఇచ్చారు. స్వప్న అగ్నిప్రమాద ఘటన చాలా బాధాకరమని అన్నారు. ఈఘటనలో 22, 23 ఏళ్ల వయసు ఉన్న పిల్లలే మరణించడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అయితే.. అగ్ని ప్రమాద నివారణకు సరైన జాగ్రత్తలు పాటించని భవన, గోదాముల నిర్వాహకులు, యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా.. ప్రమాదానికి కారణమైన స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ను సీజ్‌ చేస్తామని ప్రకటించారు..అగ్ని ప్రమాదానికి గురైన స్వప్న లోక్ కాంప్లెక్స్ ను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. ఇక.. స్వప్న లోక్ అగ్నిప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 30 నుంచి 40 లక్షల వరకూ అక్రమంగా కట్టిన బిల్డింగులు ఉన్నాయని.. వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నగరంలో అగ్ని ప్రమాదంపై ప్రస్తుతం స్పెషల్ డ్రైవ్ నడుస్తోందన్నారు తలసాని.. పోస్టుమార్టం పూర్తైన తర్వాత ప్రభుత్వ అంబులెన్సుల్లోనే వారి సొంత గ్రామాలకు డెడ్ బాడీలను తరలిస్తామని తెలిపారు.

Read also: Gun Park tension: గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత.. బండిసంజయ్, ఈటెలను అడ్డకున్న పోలీసులు

నగరంలో ఎక్కడెక్కడ అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. అంతే కాకుండా.. తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని వ్యాపార సముదాయ నిర్వాహకులను హెచ్చరిస్తున్నా.. అయినా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగడం దురదృష్టకరమన్నారు. స్వప్పలోక్‌ ప్రమాదం జరిగిన వెంటనే కొంతమందిని రెస్క్యూ ఫైర్ సిబ్బంది కాపాడారని చెప్పారు. ఆరుగురు మాత్రం 5వ అంతస్తులోనే చిక్కుకోవడంతో ఊపిరి ఆడక పొగ పీల్చుకుని చనిపోయారని చెప్పారు. అయితే.. చనిపోయిన వారు క్యూనేట్ అనే సంస్థలో పని చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తెలిసిందన్నారు. అయితే.. క్యూనేట్ సంస్థపైనా చాలా ఫిర్యాదులు సైతం ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహాయంతో పాటు క్యూనెట్ నుండి మృతుల కుటుంబ సభ్యులకు సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు మంత్రి తలసాని. ఇక హైదరాబాద్ లో సుమారుగా 30 నుంచి 40 లక్షల వరకూ ఉన్నాయి. దానిపై చర్యలు తీసుకోవాలంటే చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
India vs Australia: తొలి వన్డేలో తొలి వికెట్.. సిరాజ్ దెబ్బకు ట్రావిస్ ఔట్

Exit mobile version