Site icon NTV Telugu

Talasani Srinivas: మధ్య దళారులను నమ్మొద్దు, మోసపోవద్దు.. తలసాని సూచన..

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

Talasani Srinivas warangal tour: సామాజిక దృష్టి కోణంలో కుల వృత్తులను కేసీఆర్ ప్రోత్సాహిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పల్లెగుట్ట వద్ద ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి జనగామ జిల్లా లోని స్టేషన్ ఘన్ పూర్ లో ప్రారంభించడం జరిగిందని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఉచిత చేప‌పి‌ల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తల‌సాని శ్రీని‌వాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న 26,778 నీటి వనరులలో రూ.68 కోట్ల వ్యయంతో 88.53 కోట్ల చేపపిల్లలను రూ.24.50 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 2015 సంవత్సరంలో 3779 చెరువులు ఉండగా.. ఇప్పుడు 26000 చెరువులలో దాదాపు 25 కోట్ల వ్యయంతో చేప పిల్లలు వదిలామని స్పష్టం చేశారు. మత్స్య మిత్ర ఆప్ కూడా రూపొందించామన్నారు. మత్స్య కారులు ఆర్ధికంగా బలోపేతం కావాలి, దళారులకు ఇవ్వొద్దని తెలిపారు.

చేప పిల్లల కౌంటింగ్, నాణ్యత కూడా గమనించి జాగ్రత్తగా చేసుకోవాలని అన్నారు. సీఎం కేసీఆర్‌ కోరిక మేరకు మన ఊరు మన బడిలో భాగంగా విద్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఎవరు పడితే వారు టీవీల్లో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సెంట్రల్ ఫైనాన్సు మినిష్టర్ మోడీ ఫోటో పెట్టాలని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి మధ్య దళారులను నమ్మొద్దు, మోసపోవద్దు, ఆర్ధికంగా మత్స్య కారులు నష్టపోవద్దని సూచించారు. 26000 చెరువులకు జియో టాగ్ చేశామని, ఇవి మీ ఆస్తులు, మీరే జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. ఇప్పుడు శంఖుస్థాపన చేసిన స్థలం దళితుల భూమి అని తెలిసింది, వీలైతే వేరే జాగలో షెడ్డు వేయాలి అని ఎమ్మెల్యే కోరుతున్నానని అన్నారు తలసాని.
CM Jagan LIVE : ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ lTeachers Day Celebrations @ Vijayawada

Exit mobile version