NTV Telugu Site icon

Talasani Srinivas Yadav: మన కల్చర్ మరిచిపోతున్నారు

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav: మన కల్చర్ మరిచిపోతున్నారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోనీ పీపుల్స్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 2014 వరకు నీళ్లు లేవు.. పంటలు లేవన్నారు. కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. తెలంగాణ రైతాంగం సంతోషంగా ఉందని తెలిపారు. పాశ్చాత్య మోజులో పండగ సంస్కృతి మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పతంగులు ఎగిరిద్దామంటే కనీసం గాలి కూడా రావడం లేదన్నారు. చైనా మంజాలు అంటున్నారు.. చిన్నప్పుడు మేమే మంజాలు తయారు చేసుకునే వాళ్ళమన్నారు. ఆంధ్ర పోతే కోడి పందేలు, గుండాటలు ఆడుతారన్నారు. మన కల్చర్ మరిచిపోతున్నారని మంత్రి తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలియజేయాలని కోరారు. సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలి. దేశానికి అన్నం పెట్టే రైతులు, రాష్ట్ర ప్రజలు పాడి పంటలతో సంతోషంగా జీవించాలి. మన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, పండుగల గొప్పతనాన్ని చాటిచెప్పాలనే ఉద్దేశంతో గాలిపటాల పండుగ నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు.

Read also: Mukarram Jah: ఎనిమిదో నిజాం నవాబు ముకరం ఝా ఇకలేరు..

ఇక సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు పేర్లతో వరినాట్లు, ముగ్గులు దర్శనమిస్తున్నాయి. వెంకటాపూర్ లో తమ పొలంలో ప్రముఖుల పేర్లతో చిన్నారులు వరి నాట్లు వేశారు. ముఖ్యమంత్రి KCR, మంత్రి హరీష్ రావుపై అభిమానంతో పొలంలో వరి నాట్లు, ఇంటి దగ్గర ముగ్గులు వేసిన చిన్నారులు వేసినట్లు తెలిపారు.

Read also: Beauty Mistakes: అందంగా కనిపించాలంటే ఈ తప్పులు చేయకండి

తక్కువ సమయంలో సీఎం కేసీఆర్‌ రాష్ట్రం అభివృద్ధి చేశారని బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. భారతదేశంలో ఇంటి ఇంటికి తాగు నీరు ఇచ్చే రాష్ట్రం ఏది లేదన్నారు. దేశంలో ఇంటి ఇంటికి మంచి నీరు ఇచ్చే రాష్ట్రం తెలంగాణా రాష్ట్రమేనని కేంద్రం స్పష్టం చేసిందని అన్నారు. కేంద్రం విభజన చట్టంలో ఒప్పుకున్న ఒక్క అభివృద్ధి కూడా అభివృద్ధి జరగలేదని అన్నారు. మూడు సార్లు మన ముఖ్యమంత్రి ఉంటాడు. మనేదే ప్రభుత్వం ఉంటుందని తలిపారు. పక్కనున్న కర్ణాటకలో కూడా ఓ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందో మాకు అలానే కావాలి అని అడిగారంటే మన రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చెందిందో అర్ధం చేసుకోండని నామా నాగేశ్వర రావు అన్నారు.
Narendra Modi: మారుతున్న దేశ భవిష్యత్తుకు వందేభారత్ ఒక ఉదాహరణ

Show comments