Site icon NTV Telugu

Talasani Srinivas Yadav: బోనాల పండుగలో గ్రూప్‌ రాజకీయాలు సృష్టించొద్దు

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ బోనాల పండుగలో గ్రూప్‌ రాజకీయాలు సృష్టించొద్దని, ఎవరైనా గొడవలకు దిగితే సహించేదిలేదని హెచ్చరించారు. ఈనేపథ్యంలో.. హైదరాబాద్ పాతబస్తీ సుల్తాన్ షాహీ శ్రీ జగదాంబ అమ్మవారి దేవాలయం వద్ద ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీతో పాటు పాతబస్తీ పరిధిలో ఉన్న ఇతర దేవాలయాలకు బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వ తరఫున మంత్రి చెక్కులు అందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రైవేటు దేవాలయాలకు సైతం ఆర్థిక సహాయం అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తెలిపారు. ఓల్డ్‌సిటీలో ఏవైనా పనులు కావాలంటే తన దృష్టికి తేస్తే చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలో బోనాల పండుగను విశ్వవ్యాప్తం చేయాలని అన్నారు. అనవసరంగా గొడవలు పడొద్దని సూచించారు. అయితే.. కొందరు తమ వ్యక్తిగత గొడవలకు పండుగను వాడుకుంటున్నారని.. లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో తగ్గేది లేదని మంత్రి స్పష్టం చేశారు.
Italy: కూలిన మరో ప్రభుత్వం.. ప్రధాని రాజీనామా

Exit mobile version