NTV Telugu Site icon

Talasani Srinivas Yadav : ఎనిమిదేళ్లలో బీజేపీ దేశానికి చేసింది ఏమి లేదు

Talasani

Talasani

ఈ సారి రాష్ట్రపతి ఎన్నికల ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. విపక్షాల కూటమి యశ్వంత్‌ సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించగా.. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎన్డీయే అధిష్టానం ప్రకటించింది. అయితే రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థులు ప్రచారంలో మునిగితేలారు. ఈ క్రమంలోనే యశ్వంత్‌ సిన్హా రేపు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. అయితే.. యశ్వంత్‌ సిన్హా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రేపు ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ కి వస్తారని, ముఖ్యమంత్రి సహా మంత్రులు గ్రేటర్ ప్రజా ప్రతినిధులు హాజరవుతారన ఆయన వెల్లడించారు. బేగంపేట నుండి ఖైరతాబాద్ మీదుగా జలవిహార్ వరకు ర్యాలీగా వస్తారన్న మంత్రి తలసాని.. రాష్ట్రపతి ఎన్నికలో ఓటింగ్ లో పాల్గొనే వారందరు ఇక్కడ పాల్గొంటారని తెలిపారు.

Vijayashanthi : ఎంతమంది గుంపులుగా, గ్రూపులుగా వచ్చినా.. మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

బీజేపీ మీటింగ్ జరుగుతుంది.. ఇంకోవైపు యశ్వంత్ సిన్హా సమావేశం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రేపు యశ్వంత్ సిన్హాని సీఎం కేసీఆర్ రిసీవ్ చేసుకుంటారని, ఈ ఎనిమిదేళ్లలో బీజేపీ దేశానికి చేసింది ఏమి లేదని ఆయన విమర్శించారు. వాళ్ళు ఎన్ని చేసినా.. తెలంగాణలో పప్పులు ఉడకవని, రేపు హైదరాబాద్‌కి వచ్చే నేతలు హైదరాబాద్ అందాలని చూస్తారని, ఈ మూడు రోజులు టూరిస్టుల్లాగా వస్తున్నారని, వచ్చి చూసి పోతారంటూ ఎద్దేవా చేశారు. దేశంలో మార్పు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా సికింద్రాబాద్ లో ఏ పని చేసాడో చూపించాలని ప్రశ్నించారు. బీజేపీ తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ భయపడదని ఆయన వెల్లడించారు. ఇక్కడ టీఆర్ఎస్ నేతలు మాత్రమే పాల్గొంటారు. ఇతర ఏ రాజకీయ పార్టీ పాల్గొనదని ఆయన స్పష్టం చేశారు.