టీఆర్‌ఎస్ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా హైదరాబాద్ వేదికగా హైటెక్స్ లో ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ ప్లీనరీ సమావేశంలో టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా 9వ సారి కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శమని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా బడుగు, బలహీన వర్గాలు కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి చెందాయన్నారు. అన్ని కులాలను, వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కేసీఆర్ లక్ష్యమని, దళితులకు అండగా ఉండేందుకు దళిత బంధు అని అన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ పథకాలే దేశంలోని అన్ని రాష్ట్రాలకు స్పూర్తిగా నిలుస్తాయన్నారు.