Site icon NTV Telugu

Srinivas Goud: నీరా కేఫ్ పేరుపై బ్రాహ్మణ సంఘాల వివాదం.. స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas

Srinivas

Srinivas Goud: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్న నీరా కేఫ్ లకు నిర్ణయించిన పేరుపై వివాదం రేగింది. నీరా కేఫ్ కు వేదామృతంగా తెలంగాణ ప్రభుత్వం పేరు పెట్టింది. దీంతో.. నీరా కేఫ్ కు వేదామృతం పేరు పెట్టడంపై తెలంగాణ బ్రాహ్మణ, హైందవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాగా.. నీరా కేఫ్ కు ఈ పేరు పెట్టడం అంటే హిందూ సంస్కృతిలో భాగమైన వేదాలను అవమానించడమే అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో.. నీరా కేఫ్ లో కల్లుకు వేదామృతం పేరును తొలగించేలా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బ్రాహ్మణ సంస్థ పరిషత్ ఛైర్మన్ కేవీ రమణాచారికి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు నిన్న వినతి పత్రం అందజేశారు. ఇకదీనిపై ఇవాళ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. కాగా.. వేదామృతం అనే పదంపై వివాదం ఉంటే పరిశీలిస్తామని చెప్పారు. ఇక.. కల్లు వేరు నీరా వేరని చెప్పిన మంత్రి.. వేదాలను అధ్యయనం చేసిన తర్వాతే నీరా కేఫ్ లకు వేదామృతం అనే పేరు చూసించామన్నారు. అంతేకాకుండా.. తాటి చెట్టును ప్రకృతి ఔషధంగా వేదాలు వర్ణించాయని, వేదాలను కులాల రహితంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. వేదాల్లో సురాపానం గురించి ఉందన్నారు.

Read also: Ponguleti Srinivasa Reddy: నేను ఉగ్రవాదిని కాదు కబ్జాలు చేయలేదు.. నాకు సెక్యూరిటీ అవసరం లేదు

అయితే.. నీరా కేఫ్‌లకు వేదామృతం అని పేరు పెట్టి వేదాలను కించపరుస్తున్నారని తెలంగాణ ఎక్సైజ్ శాఖపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. ఈనేపథ్యంలో.. వేదామృతం పేరు పెట్టాలనే నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం తెలిపాయి. అంతేకాకుండా.. వేదామృతం పేరు మార్చేలా చూడాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడికి ఈ మేరకు వినతి పత్రం అందజేశాయి. ఈ..పేరు మార్చకపోతే ఆందోళన చేస్తామని బ్రాహ్మణ సంఘాలు హెచ్చరించాయి. అయితే ఇదిలా ఉండగా నీరా ప్రాజెక్టుకు వేదామృతం అనే పేరు మార్చొద్దని జైగౌడ్ ఉద్యమనేతలు డిమాండ్ చేస్తున్నాయి..పేరు మార్పు ఆలోచన చేస్తే సహించేది లేదని హెచ్చారిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ & డైరీ లను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి ఆవిష్కరించారు.

Exit mobile version