Site icon NTV Telugu

Srinivas Goud: రబ్బర్ బుల్లెట్ పేల్చితే రాజీనామా చేయాలా? విడ్డూరంగా ఉంది..!

Srinivas Goud

Srinivas Goud

మహబూబ్‌నగర్‌ ఫ్రీడం ఫర్‌ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గాల్లోకి కాల్పులు జరపటం పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు మండిపడ్డారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఫ్రీడమ్ ర్యాలీలో తుపాకీతో తాను కాల్పులు జరపడాన్ని విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తాను పేల్చింది రబ్బర్ బుల్లెట్ అని స్పష్టంగా చెప్పినప్పటికీ విపక్షాలు కక్కుర్తి రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ తనను రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మహబూబ్‌నగర్‌లో ఏ చట్ట ప్రకారం తుపాకి తీసుకుని గాలిలోకి కాల్పులు జరిపారని ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు ఏమైనా లైసెన్స్‌ ఉందా అని రఘునందన్‌రావు నిన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. దీనిపై మాట్లాడేందుకు డీజీపీ ఆఫీసుకు ఎప్పుడు రమ్మంటారని, మంత్రి పేల్చిన తుపాకిని ఫోరెన్సిక్‌ ల్యాబ్​కు పంపాలని అన్నారు. లేకుంటే.. రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని, ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని రఘునందన్‌రావు కోరారు.

భారతీయ శిక్షా స్మృతి, రాజ్యాగం ప్రకారం ఈ చట్టాలలో ఎక్కడ అన్న ఎస్పీకి ఒక ప్రైవేట్ వ్యక్తికి తుపాకీ ఇచ్చి కాల్చమని చెప్పే చట్టముందా అంటూ ప్రశ్నించారు. తను ఒక బాధ్యత గల మంత్రి, తన గన్​మెన్ దగ్గర నుంచి తీసుకున్నారు. కానీ.. దాని కప్పి పుచ్చుకోవాడానికి ఎస్పీ నేనే ఆ తుపాకీ ఇచ్చాను అని చెప్పారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ వెంటనే స్పందించి ఎస్పీపై చర్యలు తీసుకోవాలని, శ్రీనివాస్‌ గౌడ్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్డ్‌ అయ్యాక వచ్చే సలహాదారు పోస్టు కోసమే ఈ ఘటనపై చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు.
Kashmir: 30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో ప్రారంభంకానున్న సినిమా థియేటర్లు

Exit mobile version