Site icon NTV Telugu

D. Sridhar Babu: పేదవారికి అన్యాయం జరిగితే సహించేది లేదు..

D Sridhar Babu

D Sridhar Babu

D. Sridhar Babu: పేదవారికి అన్యాయం జరిగితే సహించేది లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ లో మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశిక్రిష్ణ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిన నాలుగేళ్లలోనే ఈ ప్రాంతంలో అనేకమందిపై దాడులు చేసింది, మేము గెలిచినప్పటి నుండి శాంతియుత పాలన కొనసాగిస్తున్నామన్నారు. కొంతమందికి మూర్ఖులు నన్ను మోసం చేసినా, వెన్నుపోటు పొడిచినా దేవున్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నా అన్నారు. అవినీతి లేకుండా స్వచ్ఛమైన రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. కులం పేరుతో మతం పేరుతో రాజకీయం చేస్తే ఊరుకోము ,మతం కాదు పేదలకు చదువులు, ఉద్యోగాలు, ఇళ్లు సంక్షేమం కావాలన్నారు.

Read also: Manda Krishna Madiga: మోడీ గెలుపునకు కృషి చేస్తా..

పేదవారికి అన్యాయం జరిగితే సహించేది లేదు, అభివృద్ది సంక్షేమమే మా ప్రధాన లక్ష్యం అన్నారు. యువతరానికి స్ఫూర్తిగా నిలబెట్టాలని ఏఐసీసీ వంశిక్రిష్ణ ను ఎంపిక చేసిందని తెలిపారు. ఇక మరోవైపు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశిక్రిష్ణ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు, మళ్ళీ ఓటు అడుగుతున్న బీఆర్ఎస్ నేతలను నిలదీయాలన్నారు. ఇక్కడ పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ముసుగేసుకొని మోసం చేయడానికి వస్తున్న బీఆర్ఎస్ నాయకులు అన్నారు. గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలోనే పరిశ్రమలు వచ్చాయన్నారు. ఉద్యోగాల కల్పన విషయంలో బీఆర్ఎస్ నేతలు లంచాలు తీసుకున్నారని హాట్ కామెంట్ చేశారు.
Allu Arjun At Nandyal: నంద్యాలలో అల్లు అర్జున్ సందడి.. ఇదేం క్రేజ్‌ మామ..!

Exit mobile version