Site icon NTV Telugu

Minister Seethakka: బీజేపి, ఆర్ఎస్ఎస్ పై మంత్రి సీతక్క హాట్ కామెంట్స్

Seetakka

Seetakka

Minister Seethakka: బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ పై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. పదేళ్ళ బీజేపీ పాలనలో ఏం చేసింది? అని ప్రశ్నించారు. జీఎస్టి పెంచి ఆఖరికి బట్ట కట్టుకొని పరిస్థితి తెచ్చిందన్నారు. చీరల మీద సైతం జీ ఎస్టీ వేశారని మండిపడ్డారు. ఉద్యోగం అడిగితే దేవుడిని చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి అడిగితే అయోధ్య ను చూపిస్తున్నారు. మూడు నెలల్లో 34 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గాంధీ ని చంపిన గాడ్సే మీ నాయకుడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గాడ్సే అంటే ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ అని హాట్ కామెంట్స్ చేశారు. 50ఏళ్ల నుంచి తిరంగా జెండా ఎగరనీయలే అన్నారు. బ్రిటిష్ వాడు ఎలా జెండా పట్టుకుంటే చంపేశాడని ప్రశ్నించారు.

Read also: Archery World Cup 2024: ఒలింపిక్ ఛాంపియన్‌ను ఓడించి.. స్వర్ణ పతకం కైవసం చేసుకున్న భారత్!

బీజేపి సైతం జెండా ఎగర నియలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ ఎస్ ఎస్ వాళ్లు ఇప్పటికీ వాళ్ల గద్దెమీద జాతీయ జెండాను ఎగురవేయరన్నారు. పైకి మేమే దేశ భక్తులం అంటారు.. ముగ్గురు ప్రధానులు చేసిన కుటుంబంలో పుట్టిన రాహుల్ గాందీ కుటుంబానికి సొంత ఇల్లె లేదని గుర్తు చేశారు. రాహుల్ గాందీ కి సొంత ఇల్లు లేదని తెలిపారు. మోడీ సూట్ 16 లక్షలు..మేకప్ కే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపి రాజ్యాంగం మారుస్తాం అంటున్నారని, అలా అయితే మన హక్కులు పోతాయని, రిజర్వేషన్ లు పోతాయని సీతక్క గుర్తు చేశారు.
Manipur : మణిపూర్‌లో మళ్లీ హింస.. ఇంఫాల్‌లో కాల్పులు.. దెబ్బతిన్న ఇళ్లు

Exit mobile version